Bandi Sanjay: ఫోరెన్సిక్ ల్యాబ్ పని తీరు ప్రశంసనీయం
ABN, Publish Date - Nov 22 , 2024 | 02:36 AM
సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(సీఎ్‌ఫఎ్‌సఎల్) పనితీరు ప్రశంసనీయమని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ అన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంజయ్
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(సీఎ్‌ఫఎ్‌సఎల్) పనితీరు ప్రశంసనీయమని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశవ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలతోపాటు నార్కోటిక్, సైబర్, మనీ లాండరింగ్ నేరాలకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో సీఎ్‌ఫఎ్‌సఎల్‌ను తీర్చిదిద్దిందని తెలిపారు. గురువారం రామంతాపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(సీఎ్‌ఫఎ్‌సఎల్), నేషనల్ సైన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్(ఎన్సీఎ్‌ఫఎల్), సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (సీడీటీఐ) సంస్థలను సంజయ్ సందర్శించారు.
ఆయా సంస్థల్లోని ప్రతి విభాగానికి వెళ్లి పరిశీలించారు. అధికారులతో సమావేశమై ఆయా విభాగాల పనితీరును తెలుసుకున్నారు. దక్షిణ భారత దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థలు హైదరాబాద్‌లో ఉండటం గర్వకారణమని సంజయ్ అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వేలాది కేసుల పరిష్కారానికి తమను సంప్రదిస్తున్నారని, నేర పరిశోధనకు అవసరమైన ప్రామాణిక పత్రాలను సీఎ్‌ఫఎల్‌ఎల్ అందజేస్తోందని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు.
Updated Date - Nov 22 , 2024 | 02:36 AM