Bandla Krishna Mohan Reddy: సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల ఎమ్మెల్యే భేటీ

ABN, Publish Date - Aug 02 , 2024 | 11:30 AM

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గత నెలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశం కావడంతో తిరిగి ఆ పార్టీలో చేరతారా అనే సందేహాలు వచ్చాయి. ఆ వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగారు. బండ్లతో చర్చలు జరిపి, సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకొచ్చారు.

Bandla Krishna Mohan Reddy: సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల ఎమ్మెల్యే భేటీ
Bandla Krishna Mohan Reddy Meet CM Revanth Reddy

హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (Bandla Krishna Mohan Reddy) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గత నెలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశం కావడంతో తిరిగి ఆ పార్టీలో చేరతారా అనే సందేహాలు వచ్చాయి. ఆ వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగారు. బండ్లతో చర్చలు జరిపి, సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకొచ్చారు.


తీసుకొచ్చిన మంత్రి జూపల్లి

సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు తీసుకొచ్చారు. సీఎంతో భేటీ తర్వాత బండ్ల భవిష్యత్ కార్యాచరణ తెలియనుంది. బండ్లకు నామినేటెడ్ పదవి, లేదంటే నియోజకవర్గానికి నిధులపై హామీ ఇస్తారని తెలుస్తోంది.


అభివృద్ధి కోసం నిధులు..!!

గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నిన్న బండ్లను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. గద్వాల రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దుతామని మంత్రి జూపల్లి.. బండ్లకు హామీనిచ్చారు. జూపల్లి భరోసా ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని బండ్ల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్, ఇతర నేతలతో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి మంచి అనుబంధం ఉందని జూపల్లి కృష్ణారావు వివరించారు. ఆ క్రమంలోనే ఇటీవల వెళ్లి కలిశారని స్పష్టం చేశారు.


కాంగ్రెస్‌లో చేరిక..

బీఆర్ఎస్ పార్టీని వీడి జూలై 6వ తేదీన బండ్ల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల కేటీఆర్‌ను కలువడంతో రాజకీయంగా దుమారం చెలరేగింది. దాంతో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. బండ్లతో చర్చలు జరిపి, పార్టీలో కొనసాగాలని కోరినట్టు సమాచారం.

Updated Date - Aug 02 , 2024 | 11:30 AM

Advertising
Advertising
<