ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bathukamma: బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పూల పండగ విశేషాలివే

ABN, Publish Date - Oct 02 , 2024 | 11:03 AM

Telangana: ఒక్కోరోజు ఒక్కోపేరుతో బతుకమ్మను పేరుస్తారు మహిళలు. ఆడపడుచులు తమ అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చి బతుకమ్మను చేస్తుంటారు. తీరొక్క పూవులతో బతుకమ్మ పేరుస్తారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ మొదలవుతుంది.

Telangana Bathukamma

తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ (Bathukamma) పండుగ రానేవచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ ఈరోజు (బుధవారం) నుంచి ప్రారంభంకానుంది. తెలంగాణ ప్రజలకు ఈ పండుగ చాలా ప్రత్యేకమైంది. తెలంగాణ సంస్కృతిక ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ నేటి (అక్టోబర్ 2) నుంచి తొమ్మిరోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు జరుపుకోనున్నారు. ప్రకృతి మిళితంగా.. పూలపండుగగా పిలుచుకునే బతుకమ్మను ఊరూవాడా చిన్నాపెద్ద తేడా లేకుండా ఆటపాటలతో జరుపుకుంటారు. ‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’’ అంటూ ... బతుకమ్మపై పాటలు పాడుతూ మహిళలు పండుగ చేసుకుంటారు. ఒక్కోరోజు ఒక్కోపేరుతో బతుకమ్మను పేరుస్తారు. ఆడపడుచులు తమ అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చి బతుకమ్మను చేస్తుంటారు. తీరొక్క పూలతో బతుకమ్మ అలంకరిస్తారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ మొదలవుతుంది.

Gold And Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త


బతుకమ్మకు వాడే పూలు..

బతుకమ్మ కోసం గునుగు పూలు, తంగేడు పూలు, బంతిపూలు, చామంతి, నంది వర్ధనం ఇలా రకరకాల పూలతో బతుకమ్మకు ఉపయోగిస్తారు. ప్రతీరోజు ఒక్కో నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. బతుకమ్మను పేర్చిన తర్వాత మహిళలు తోటి మహిళలతో కలిసి ఆరుబయట బతుకమ్మను వలయాకారంలో పెడతారు. బతుకమ్మ చుట్టూ మహిళలు చప్పట్లు కొడుతూ తిరుగుతూ పాటలు పాడుతుంటారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మకు సంబంధించి అనేక పాటలు పాడతారు. తొలుత బొడ్డెమ్మతో మొదలుకుని ఎంగిలిపుప్వు బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిరోజుల పాటు బతుకమ్మను పేరుస్తారు. మొదటి ఎనిమిది రోజుల పాటు మహిళలు రోజూ బతుకమ్మ చేసి... సాయంత్రం వేళ ఇంటి బయట పెట్టి దాని చుట్టూ పాటలు పాడుతూ తిరిగి దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మను మాత్రం మహిళలు అత్యంత కోలాహలంగా జరుపుకుంటారు.


సద్దుల బతుకమ్మ ప్రత్యేకత

తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో చివరి రోజు మాత్రం అత్యంత ప్రత్యేకమైనది. బతుకమ్మకు అవసరమైన పూలను తెచ్చుకుని మహిళలు బతుకమ్మను తయారు చేస్తుంటారు. ఎంత పెద్దగా బతుకమ్మ ఉంటే అంత గొప్పగా భావిస్తుంటారు మహిళలు. ముందుగా ఒక పల్లెంలో మోదుగాకు పరిచి.. దానిపై కుంకమ, పసుపు వేస్తారు. ఆ తరువాత గునుగు పువ్వును ఒక వరుసగా పేర్చి.. దానిపై బంతిపూలు, చామంతులు ఇలా అనేక రకాల రంగు రంగుల పూలతో పేరుస్తారు. అలాగే గునుగు పువ్వుకు రంగులు అద్ది పేరుస్తుంటారు. అలాగే బతుకమ్మ మధ్యలో వివిధ రకాల పూల రెక్కలు, ఆకులతో నింపుతుంటారు. ఈ విధంగా త్రికోణంలో అతి పెద్దగా.. తీరొక్క పువ్వుతో బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మను పేర్చిన తర్వాత గౌరమ్మను చేసి పెడతారు. బతుకమ్మ పూర్తి అయిన తరువాత దేవుడి మందిరంలో పెట్టి అగరుబత్తులతో పూజ చేసి.. ఐదు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం సద్దుల బతుకమ్మ రోజు సాయంత్రం వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసి.. మహిళలు తమ బతుకమ్మలను అక్కడ ఉంచుతారు. తోటి మహిళలతో కలిసి బతుకమ్మ పాట పాడతారు. ఒక్కో ఇంటి ముందు ఐదేసి (అంతకుమించి) పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు మహిళలు. ఆపై తమ తమ బతుకమ్మలను దగ్గరలో ఉన్న చెరువులల్లో కానీ, బావిలో కానీ నిమజ్జనం చేస్తారు. ఆపై పల్లెంలో తెచ్చిన చెరువు నీటితో మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుని తాము చేసిన ప్రసాదాలను పంచుకుంటారు. ఇంతటితో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి.


తొమ్మిది రోజుల బతుకమ్మ విశేషాలు ఇవే..

తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ మొదలవగా.. చివరగా సద్దుల బతుకమ్మతో సంబురాలు ముగుస్తాయి. ప్రతీ రోజు ఒక్కో పేరుతో బతుకమ్మను పేర్చుతూ.. ఒక్కో రకమైన నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.

తొలిరోజు

ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్తరమాస అని కూడా అంటారు.

నైవేద్యం: నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు.

రెండో రోజు

అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ఈ బతుకమ్మను చేస్తారు.

నైవేద్యం: సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.


మూడో రోజు

ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

నాలుగో రోజు

నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

ఐదవ రోజు

అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆరవ రోజు

అలిగిన బతుకమ్మ: ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.

ఏడవ రోజు

వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఎనిమిదవ రోజు

వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

తొమ్మిదవ రోజు

సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం నైవేద్యంగా సమర్పిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Oct 02 , 2024 | 11:29 AM