ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Police Security: పోలీసుశాఖకు పూర్తి స్థాయిలో నిధులు

ABN, Publish Date - Aug 31 , 2024 | 03:05 AM

హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో భద్రత కల్పించే విషయంలో పోలీసుశాఖకు అవసరమైన పూర్తి స్తాయి నిధులను కేటాయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

  • ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు లైసెన్సులు తీసుకోవాలి: భట్టి

  • ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలు ప్రమాణాలు పాటించాలి: దుద్దిళ్ల

హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో భద్రత కల్పించే విషయంలో పోలీసుశాఖకు అవసరమైన పూర్తి స్తాయి నిధులను కేటాయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.10 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించామని చెప్పారు. పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కార్యాలయంలో శుక్రవారం హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ (హెచ్‌సీఎ్‌ససీ) ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో దాదాపు 1500 ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలున్నాయని, వాటిల్లో రిజిస్టర్‌ అయినవి 500 మాత్రమే అని చెప్పారు.


మిగిలిన సంస్థలు కూడా నిబంధనలు పాటించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని, గ్రామీణ యువతకు ఉపాధి కల్పించి మంచి వేతనాలివ్వాలని సూచించారు. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ప్రైవేట్‌ సెక్యూరిటీ రంగంలో పనిచేస్తున్నారని వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని భట్టి హామీ ఇచ్చారు. అనంతరం సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ, రక్షణ రంగంలో పనిచేస్తున్న సైనికులు, పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది, ఇతరులను కాపాడేందుకు అన్ని వేళలా ముందుంటారన్నారు.


అదనపు డీజీ మహేష్‌ భగవత్‌ మాట్లాడుతూ, పలు ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల పనితీరును ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించారు. సదస్సు ముగింపు కార్యక్రమంలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ ఐటీ, ఫార్మా, నిర్మాణం, పర్యాటకం, వాణిజ్య రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోందని, స్థానిక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

Updated Date - Aug 31 , 2024 | 03:05 AM

Advertising
Advertising