ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam : బీసీ గురుకులాలు, హాస్టళ్లపై 15 రోజులకో నివేదిక ఇవ్వాలి: మంత్రి పొన్నం

ABN, Publish Date - Sep 27 , 2024 | 03:15 AM

రాష్ట్రంలోని బీసీ గురుకులాలు, హాస్టళ్లలో విద్యా ప్రమాణాలు, సౌకర్యాల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలపై 15 రోజులకోసారి పురోగతి నివేదిక ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బీసీ గురుకులాలు, హాస్టళ్లలో విద్యా ప్రమాణాలు, సౌకర్యాల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలపై 15 రోజులకోసారి పురోగతి నివేదిక ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో విద్యాబోధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడమేకాకుండా పిల్లల వ్యక్తిగత నైపుణ్యాలను మెరుగుపరిచేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.


సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ‘హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి. ఈ విషయంలో సంబంధిత అధికారులెవరూ అలక్ష్యంగా వ్యవహరించకూడదు. విద్యార్థుల స్టడీ అవర్స్‌, బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ టైమ్‌లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి’ అని సూచించారు.

Updated Date - Sep 27 , 2024 | 03:15 AM