ఝార్ఖండ్ సంపదపై బీజేపీ కన్ను: భట్టి
ABN, Publish Date - Nov 18 , 2024 | 04:04 AM
ఝార్ఖండ్ ప్రజలపై బీజేపీకి ప్రేమ లేదని, ఇక్కడి అపార ఖనిజ సంపదపైన ఆ పార్టీ కన్నేసిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
హైదరాబాద్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఝార్ఖండ్ ప్రజలపై బీజేపీకి ప్రేమ లేదని, ఇక్కడి అపార ఖనిజ సంపదపైన ఆ పార్టీ కన్నేసిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖనిజ సంపదను అంబానీ, అదానీలకు అప్పగించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఝార్ఖండ్ ఎన్నికల పరిశీలకులుగా ఉన్న భట్టి.. ఆదివారం బోకారో నియోజకవర్గంలో ఇండియా కూటమి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సంపదను, వనరులను కాపాడే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
జనాభా నిష్పత్తి ప్రకారం దేశ సంపద, వనరుల పంపిణీ జరగాలని రాహుల్ చెబుతున్నారని, ఇదే నినాదంతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఝార్ఖండ్‌లోనూ ఇండియా కూటమి గెలిస్తే.. ఇక్కడి సంపద ఈ ప్రాంత వాసులకే పంచుతామన్నారు. తెలంగాణ తరహాలో ఏడు గ్యారెంటీలను అమలు చేస్తుందని తెలిపారు.
Updated Date - Nov 18 , 2024 | 04:04 AM