ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: కలెక్టర్‌పై దాడి బీఆర్‌ఎస్‌ కుట్రే

ABN, Publish Date - Nov 14 , 2024 | 03:49 AM

లగచర్లలో కలెక్టర్‌, అధికారులపై దాడి బీఆర్‌ఎస్‌ కుట్రేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అరాచక శక్తుల ద్వారా అమాయకులైన దళిత, గిరిజన రైతులను రెచ్చగొట్టి దాడి చేయించారని ధ్వజమెత్తారు.

  • ఇందులో ఎంత పెద్ద వారున్నా.. ఉపేక్షించం

  • తెలంగాణ ఉద్యమంలో యువత ప్రాణాలు తీశారు

  • ఇప్పుడూ అదే తీరులో రైతులను రెచ్చగొడుతున్నారు

  • ‘ఫార్ములా-ఈ’ కేసు నుంచి తప్పించుకోవడానికి

  • బీజేపీతో కేటీఆర్‌ ఒప్పందం: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): లగచర్లలో కలెక్టర్‌, అధికారులపై దాడి బీఆర్‌ఎస్‌ కుట్రేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అరాచక శక్తుల ద్వారా అమాయకులైన దళిత, గిరిజన రైతులను రెచ్చగొట్టి దాడి చేయించారని ధ్వజమెత్తారు. దాడి నేపథ్యంలో ఫోన్‌ కాల్స్‌ డేటాను పరిశీలించగా...బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన ఓడిన అభ్యర్థి ఈ తతంగం నడిపించినట్లు తేలిందన్నారు. సచివాలయంలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి విలేకరులతో మాట్లాడారు. ఈ దాడి వెనుక ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించబోమని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే... అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం, చర్చించడం, న్యాయస్థానాలకు వెళ్లడం వంటి అవకాశాలు ఉండగా... బీఆర్‌ఎస్‌ నాయకులు కుట్రపూరితంగా అమాయక రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేయించడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావొద్దు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావొద్దు, అభివృద్ధి జరగొద్దనే దుర్మార్గ ఆలోచనతో ప్రతిపక్షం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ‘‘పదేళ్ల పాటు సీఎంగా ఉన్న కేసీఆర్‌ను అడుగుతున్నా.. ఇలా దాడులు చేయించడం కరెక్టేనా? ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి ఈ విషయంపై మాట్లాడండి. ఇలా దాడులు చేయించడంపై సమాజానికి ఏం సందేశమిస్తారు? దాడులు ఎటువైపు దారి తీస్తాయో మీకు తెలియదా?’’ అని ప్రశ్నించారు.


అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇలాంటి దాడులపై కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ పేద, బడుగు, బలహీన వర్గాల యువతను రెచ్చగొట్టిన బీఆర్‌ఎస్‌.. వారి ప్రాణాలు బలిగొందని విమర్శించారు. ఇప్పుడు అధికారం పోయేసరికి మళ్లీ అదే విధంగా దళిత, గిరిజన రైతులను రెచ్చగొడుతోందని ఆరోపించారు. కేసీఆర్‌ కేటీఆర్‌, హరీశ్‌రావు.. తలకిందులుగా తపస్సు చేసినా ప్రజా ప్రభుత్వాన్ని అస్థిరపర్చలేరని అన్నారు. ఫార్ములా-ఈ రేస్‌ కేసు నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్‌ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో ఒప్పందం చేసుకున్నాడని భట్టి విమర్శించారు. ఆ ఒప్పందం కుదిరిన తర్వాతే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని పేర్కొన్నారు. గవర్నర్‌పై తమకు విశ్వాసం ఉందని, ఫార్ములా-ఈ కేసు విచారణలో ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. గవర్నర్‌ తిరస్కరిస్తే చట్ట ప్రకారం ముందుకు వెళతామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ లగచర్ల రైతుల అరెస్టును బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్‌ ఖండించారని, మరి అధికారులపై జరిగిన దాడి విషయంలో ఆ పార్టీ వైఖరేంటని ప్రశ్నించారు. దాడిని కేటీఆర్‌ ఖండించకపోగా... దాడిలో పాల్గొన్న సురేష్‌ తమ పార్టీ నాయకుడేనని, ఏం చేస్తారో చేసుకోండని మాట్లాడడం సిగ్గుచేటని అనానరు. ఇలాంటి నేతలు ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో లాఠీ దెబ్బలు తిన్నామే తప్ప తిరగబడలేదన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 03:49 AM