ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti: పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

ABN, Publish Date - Sep 02 , 2024 | 04:07 AM

భారీ వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు.

  • హైడ్రా కూల్చివేతలను 3 రోజులు ఆపి.. పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలి

  • కలెక్టర్లతో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి

ఖమ్మం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): భారీ వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్‌ నుంచి ఆదివారం ఆయన పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలన్నారు. రోడ్లపై వరద ప్రవహించే చోట వాహనాలను అనుమతించవద్దని పోలీసు శాఖను ఆదేశించారు.


హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణల తొలగింపులో ఉన్న హైడ్రా అధికారులు మూడు రోజుల పాటు కూల్చివేతలకు విరామం ప్రకటించి, రెస్క్యూ టీంలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలకు కావాల్సిన నిధులను సిద్ధంగా ఉంచామని చెప్పారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడులో వరదలో చిక్కుకున్న మత్యకారుణ్ని రక్షించేందుకు శనివారం అర్ధరాత్రి తాను స్వయంగా వెళ్లి చర్యలు తీసుకున్నట్లు గుర్తుచేశారు. నీటిపారుదల, విద్యుత్తు శాఖ అధికారులతోనూ భట్టి సమీక్షించారు. ఆదివారం ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

Updated Date - Sep 02 , 2024 | 04:07 AM

Advertising
Advertising