ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhattivikramamarka : పదేసి ఊళ్లకు ఓ రెసిడెన్షియల్‌ స్కూలు: భట్టి

ABN, Publish Date - Jul 24 , 2024 | 04:03 AM

ప్రతి మండలానికి మూడు చొప్పున.. సగటున పదేసి ఊళ్లకు ఒక రెసిడెన్షియల్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. 15 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): ప్రతి మండలానికి మూడు చొప్పున.. సగటున పదేసి ఊళ్లకు ఒక రెసిడెన్షియల్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. 15 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఒక్కో స్కూలు నిర్మాణానికి రూ.80- రూ.100 కోట్ల దాకా వ్యయం కానుందన్నారు. ఈ స్కూళ్లల్లో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ఉంటుందని చెప్పారు. ఉపాధ్యాయులకు స్కూలు భవనంలోనే వసతి ఉంటుందని పేర్కొన్నారు.

అసెంబ్లీలోని తన చాంబర్లో మీడియాతో చిట్‌చాట్‌గా భట్టి మాట్లాడారు. ప్రతి గ్రామంలోని అంగన్‌వాడీల్లో ఎల్‌కేజీ నుంచి మూడో తరగతి వరకు విద్యను అందించాలని ఇప్పటికే నిర్ణయం జరిగిందని, అంగన్‌వాడీల్లో విద్యాభ్యాసం పూర్తయ్యాక.. ఆ విద్యార్థులను ఈ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఉండలేని విద్యార్థులకు డే స్కాలర్‌ సౌకర్యమూ ఉంటుందన్నారు. కాగా దివ్యాంగులకు సంబంధించి ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ ట్వీట్‌ పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, ప్రభుత్వానికి సంబంధం లేదని భట్టి స్పష్టం చేశారు.

Updated Date - Jul 24 , 2024 | 04:08 AM

Advertising
Advertising
<