ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Assembly Criticism: సభలో భజన బృందం ఎక్కువైంది

ABN, Publish Date - Jul 26 , 2024 | 04:57 AM

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ను ఎన్నికల్లో ఓడించి కామారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ను ఎన్నికల్లో ఓడించి కామారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అనవసరంగా గెలిచి అసెంబ్లీకి వచ్చానన్న ఆయన సభ జరుగుతున్న తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేత కాటిపల్లి అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద గురువారం మాట్లాడుతూ.. సభలో భజన బృందం ఎక్కువైపోయిందన్నారు.


సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించాలనే ఆలోచన ఏ నేతకు లేదని, కొందరికి అసెంబ్లీ పేకాట క్లబ్‌గా మారిపోయిందని విమర్శించారు. ఒకరిమీద ఒకరు కామెంట్లు, జోకులు వేసుకుంటూ సభా సమయం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం మాంసాహార భోజనం చేస్తూ గడిపేస్తున్నారని అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై... ఎనిమిది, ఎనిమిది కలిపితే సున్నా అంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 05:00 AM

Advertising
Advertising
<