Raghunandhan rao: నేను రెడీ, రేవంత్ సిద్దమా..?
ABN, Publish Date - Apr 20 , 2024 | 08:55 PM
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ కంటే తాను రెండు ఆకులు ఎక్కువే చదువుకున్నానన్నారు. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతామన్నారు. ఎంతమందికి ఆ సొమ్మును పంచారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు లక్ష కోట్లు ఇస్తామన్నారు. ఇచ్చారా? అని నిలదీశారు.
మెదక్, ఏప్రిల్20: సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ కంటే తాను రెండు ఆకులు ఎక్కువే చదువుకున్నానన్నారు. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతామన్నారు. ఎంతమందికి ఆ సొమ్మును పంచారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు లక్ష కోట్లు ఇస్తామన్నారు. ఇచ్చారా? అని నిలదీశారు.
కేసిఆర్ దోచుకున్న సొమ్ముతో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.. చేశారా అంటూ రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మోడీ పదేళ్ల అభివృద్ధిపై చర్చకు నేను రెడీ, రేవంత్ సిద్దమా..? అందుకు తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర చర్చ చేద్దామా? నేనొక్కడినే వస్తా.. రేవంత్ రెడ్డి వస్తాడా..? అని ప్రశ్నించారు. మెదక్, గజ్వేల్, సిద్దిపెట్ రైల్వే స్టేషన్‌లోనేనా చర్చకు సిద్ధమా..? నిర్మాణాత్మకమైన అభివృద్ధి మెదక్ జిల్లాకు అందించిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందన్నారు.
దుబ్బాక అభివృద్ధి ఎవరు చేశారనేది నేను కాదు దుబ్బాక ప్రజలే చెబుతారన్నారు. మోడీని ఒప్పించి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పొంగులేటి తొడళ్లుడు వెంకట్రావ్‌ను ఎందుకు అరెస్ట్ చెయ్యడం లేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. క్యాబినెట్‌లో ఎంత మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారో చెప్పాలని రేవంత్‌ను సూటిగా ప్రశ్నించారు. ముదిరాజ్ వర్గం నుంచి ఒక్క ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు.
ముదిరాజ్ సామాజికవర్గంపై రేవంత్ రెడ్డి కమిట్‌మెంట్ ఇదేనా..? అంటూ సందేహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఉంటే రూ.5 వేలు, పోతే రూ.15 వేలు రైతు బంధు అన్నారని.. మరి కేసిఆర్ అదికారంలో నుంచి దిగిపోయారు.. కాంగ్రెస్ వచ్చిందని గుర్తు చేశారు. మరి రైతుబంధు రూ.15 వేలు అయ్యిందా..? ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు ఇస్తామన్నారు. దుబ్బాకకు వస్తే వీటిపైన కూడా చర్చిద్దామని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కేసిఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు దొంగ మాటలు చెప్పి దుబ్బాకలో రఘునందన్ రావును దొంగ దెబ్బ కొట్టారని ఆరోపించారు. అంతేతప్ప రఘునందన్‌రావు ఓడిపోలేదని చెప్పారు.
రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో నడుస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి నొటికేదోస్తే అది మాట్లాడుతున్నారంటూ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి మెదక్‌లో తప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చారు.. అన్ని అబద్ధాలే మాట్లాడారన్నారు. దుబ్బాకలో ఏ రంగుతో పోటీ చేశానో, మెదక్‌లో కూడా అదే రంగుతో పోటీ చేస్తున్నానని చెప్పారు. కొడంగల్‌లో ఓడిన రేవంత్ రెడ్డి మల్కాజీగిరిలో గెలవలేదా..? దుబ్బాకలో ఓడితే మెదక్‌లో పోటీ చేయకూడదా..? అని ప్రశ్నించారు.
BRS Vs Congress: రేవంత్ స్థానంలో సీఎంగా భట్టి లేదా ఉత్తమ్ ఉండుంటే..!?
ఇక్రిశాట్ 1972లో ఏర్పాటు అయ్యిందని, బీహెచ్ఎల్ 1964 నెహ్రూ ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే ఇవి ఇందిరా గాంధీ హాయంలో వచ్చాయని రేవంత్ రెడ్డి అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు. మెతుకు మెతుకు సీమనే నా మెదక్ అని ఆయన అభివర్ణించారు. రేవంత్ రెడ్డి వల్లనో, సోనియా గాంధీ వల్లనో మెదక్ పేరు రాలేదన్నారు. 1980లో ఇందిరాగాంధీ మెదక్‌లో గెలిస్తే మెదక్ రైల్వే లైన్ తెస్తానని చెప్పిందని.. కానీ 40 ఏళ్ళలో రాని మెదక్ రైల్వే లైన్ పదేళ్ళలో వచ్చిందని.. దీనిని ప్రధాని మోడీతో ప్రారంభించామని రఘునందన్ రావు గుర్తు చేశారు.
తెలంగాణ వార్తలు కోసం..
Updated Date - Apr 20 , 2024 | 08:55 PM