కాంగ్రెస్ 6 గ్యారంటీలపై రేపు బీజేపీ చార్జిషీటు
ABN, Publish Date - Nov 30 , 2024 | 04:07 AM
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గారడీ అంటూ బీజేపీ చార్జిషీటు విడుదల చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన 6 అబద్ధాలు.. 66 మోసాలు అని పేర్కొంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని బీజేపీ నిర్ణయించింది.
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గారడీ అంటూ బీజేపీ చార్జిషీటు విడుదల చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన 6 అబద్ధాలు.. 66 మోసాలు అని పేర్కొంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని బీజేపీ నిర్ణయించింది. ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. బాధితులు తమ ఫిర్యాదులను 9240015427 నెంబరుకు కాల్ చేయాలని కోరింది. ఈ మేరకు ప్రత్యేక కరపత్రాన్ని రూపొందించింది. రుణమాఫీ, రైతు భరోసా, పంటల బోనస్, రూ. 500కే గ్యాస్ సిలిండర్, రూ. 2,500 ఆర్థిక సాయం, రూ. 4 వేల పింఛన్, ఇందిరమ్మ ఇల్లు అందనివారు, మూసీ, హైడ్రా, ఫార్మాసిటీ, పోలీసు దౌర్జన్యాలు బాధితుల పేరిట రెండు క్యాటగిరీలలో ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
Updated Date - Nov 30 , 2024 | 04:07 AM