మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..

ABN, Publish Date - Mar 14 , 2024 | 08:38 PM

Telangana Elections: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయ్యాక.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు కాపాడుకోవాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం కచ్చితంగా ఆశించిన సీట్లను దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆచితేచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు...

Telangana: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ (BRS) ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయ్యాక.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు కాపాడుకోవాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం కచ్చితంగా ఆశించిన సీట్లను దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆచితేచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

AP Politics: బాబోయ్.. ఎంపీగా పోటీపై మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన పవన్‌!


ఇదిగో వీళ్లే..

మల్కాజ్‌గిరి : రాగిడి లక్ష్మారెడ్డి

ఆదిలాబాద్ : ఆత్రం సక్కు

ఎవరూ ఊహించి ఉండరేమో..!

వాస్తవానికి ఈ రెండు నియోజకవర్గాలు కీలకమైనమే. ఇందులో మల్కాజ్‌గిరి (Malkajgiri) అయితే హాట్ సీట్. ఇక్కడ్నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తరఫున పోటీచేయడానికి అభ్యర్థులు క్యూ కట్టారు. నిన్న మొన్నటి వరకూ మాజీ మంత్రి మల్లారెడ్డి తన కుమారుడికి టికెట్ తెచ్చుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేయడం మనందరం చూశాం. సీన్ కట్ చేస్తే టికెట్ వద్దు.. అసలు తాను పార్టీలో ఉండనన్నట్లుగా కొద్దిరోజులుగా మల్లారెడ్డి ప్రవర్తిస్తున్నారు. ఇక శంభీపూర్ రాజు పేరును దాదాపు అధిష్టానం ఖరారు చేసిందని భావించినప్పటికీ ఒకే ఒక్కరోజులో సీన్ మొత్తం మారిపోయింది. ఎవరూ ఊహించని రీతిలో రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్‌ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ ల‌క్ష్మారెడ్డి.. త‌న‌కు గౌర‌వం లేని పార్టీలో ఉండ‌లేనని.. అక్టోబర్-18న కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

AP Elections 2024: పవన్ ‘పిఠాపురం’ప్రకటనపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్.. ఇది చూశారో..?

ఇక ఆత్రం సక్కు విషయానికొస్తే..

అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డారు ఆత్రం సక్కు. ఈయనకు రావాల్సిన టికెట్ కోవా లక్ష్మికి దక్కింది. అయితే.. కేసీఆర్ హామీ మేరకు మెత్తబడిన ఆయనకు పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ (Adilabad) ఎంపీ టికెట్ దక్కింది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఈయనే. ఆ తర్వాత కొద్దిరోజులకే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈయనపైనే పోటీచేసి ఓడిన బీఆర్ఎస్ మహిళా అభ్యర్థి కోవా లక్ష్మికే 2023 ఎన్నికల్లో టికెట్ దక్కింది. నాడు టికెట్ రాకపోవడంతో.. ఇప్పుడు లోక్‌సభ అభ్యర్థిగా ఆత్రం సక్కును కేసీఆర్ ప్రకటించారు. వాస్తవానికి ఈ ఇద్దరూ కూడా ఈ ఎన్నికల్లో పోటీచేస్తారని బహుశా బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఊహించి ఉండదేమో.

Updated Date - Mar 14 , 2024 | 08:43 PM

Advertising
Advertising