KCR: రైతుల చెంతకు కేసీఆర్.. షెడ్యూల్ ఖరారు
ABN, Publish Date - Mar 30 , 2024 | 05:39 PM
రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిన వేళ.. చాలా చోట్ల పొట్ట దశకు వచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతన్నల దిగులును తగ్గించి వారిలో భరోసా నింపడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) రంగంలోకి దిగనున్నారు. ఆదివారం నుంచి ఆయన ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా పర్యటించనున్నారు.
నల్గొండ: రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిన వేళ.. చాలా చోట్ల పొట్ట దశకు వచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతన్నల దిగులును తగ్గించి వారిలో భరోసా నింపడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) రంగంలోకి దిగనున్నారు. ఆదివారం నుంచి ఆయన ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా పర్యటించనున్నారు.
నేరుగా రైతుల వద్దకు వెళ్లి, వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకోనున్నారు. ఈ క్రమంలో ఆయన రైతులకు భరోసా, ధైర్యం కల్పించనున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో కేసీఆర్ సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించి, పంట పొలాలను పరిశీలించనున్నారు.
షెడ్యూల్ ఇదే..
ఆదివారం ఉదయం 8:30 గంటలకు కేసీఆర్ ఎర్రవెల్లి నుంచి జిల్లాల పర్యటనకు రోడ్డు మార్గంలో బయల్దేరుతారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు ఉదయం 10:30 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఎండిన పొలాలను పరిశీలించనున్నారు. 11:30కు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయల్దేరి.. 1:30 వరకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 2 గంటలకు క్యాంపు ఆఫీసులోనే భోజనం చేస్తారు. 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30కు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి నల్లగొండ జిల్లాకు బయల్దేరుతారు.
సాయంత్రం 4:30 గంటలకు నిడమనూరు మండలానికి చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి తిరిగి ఎర్రవెల్లికి బయల్దేరతారు. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి రాత్రి 9 గంటలకు ఫాంహౌజ్ చేరుకుంటారు.
Court: భార్యను దెయ్యం, పిశాచి అని పిలవడం క్రూరత్వం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 30 , 2024 | 05:53 PM