ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: మల్లన్నా మజాకా.. బర్రెలతో మల్లారెడ్డి ముచ్చట్లు.. వీడియో చూస్తే నవ్వాగదు..

ABN, Publish Date - May 10 , 2024 | 04:11 PM

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి(MallaReddy) ఏం చేసినా సంచలనమే. తెలంగాణ రాజకీయాల్లోనే(Telangana Politics) ఆయనొక స్పెషల్. రాజకీయ నేతలందు ఆయన వేరయా అన్నట్లు ఉంటుంది మల్లారెడ్డి శైలి. తాజాగా ఎన్నికల ప్రచారంలో(Election Campaign) పాల్గొన్న మల్లారెడ్డి.. నవ్వులు పూయించారు.

CH Mallareddy

హైదరాబాద్, మే 10: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి(MallaReddy) ఏం చేసినా సంచలనమే. తెలంగాణ రాజకీయాల్లోనే(Telangana Politics) ఆయనొక స్పెషల్. రాజకీయ నేతలందు ఆయన వేరయా అన్నట్లు ఉంటుంది మల్లారెడ్డి శైలి. తాజాగా ఎన్నికల ప్రచారంలో(Election Campaign) పాల్గొన్న మల్లారెడ్డి.. నవ్వులు పూయించారు. తనదైన శైలిలో మజాక్ చేస్తూ అందరినీ ఆకర్షించారు. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసుకుందాం..


మల్లారెడ్డి మైక్ ముందుకు వస్తే చాలు.. పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డ.. సక్సెస్ అయిన అంటూ యూనిక్ డైలాగ్స్ వదులతారు. తాజాగా ఆ డైలాగ్స్‌కు నిదర్శనమైన సీన్‌ను చూపించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్ధతుగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ బర్ల కొట్టం వద్దకు వెళ్లారాయన. అక్కడ బర్రెల వద్దకు వెళ్లి వాటికి పచ్చి గడ్డి తినిపించే ప్రయత్నం చేశారు. ‘ఆ.. ఆ.. ఆ.. జర తిను ఒక బుక్క’ అని మల్లారెడ్డి అన్నారు. మరోవైపు.. జనాలు ఎక్కువగా ఉండటంతో ఆ బర్రెలు భయంతో బెదురుతున్నాయి. దాంతో వారిని పక్కకు జరగాలని వారించారు మల్లారెడ్డి. ఆ తరువాత మరోసారి బర్రెలకు గడ్డి తినపెట్టే ప్రయత్నం చేశారు. ‘నేను నీ మల్లన్నను.. చిన్నప్పుడు నీకు సేవ చేసినా..’ అంటూ ఎన్నికల ప్రచారంలో నవ్వులు పూయించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మల్లారెడ్డితో అట్లుంటది మరి అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 10 , 2024 | 04:18 PM

Advertising
Advertising