Telangana: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు హాట్ కామెంట్స్..
ABN, Publish Date - Oct 30 , 2024 | 04:15 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. హరీష్ రావును ఎలా డీల్ చేయాలో తమకు తెలుసునంటూ సీఎం చేసిన కామెంట్స్‌కు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్, అక్టోబర్ 30: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. హరీష్ రావును ఎలా డీల్ చేయాలో తమకు తెలుసునంటూ సీఎం చేసిన కామెంట్స్‌కు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం నాడు మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న హరీష్ రావు.. రేవంత్‌ను ఎలా డీల్ చేయాలో రాసి పెట్టుకుంటున్నామన్నారు. తనను డీల్ చేయడానికంటే ముందు తన ముఖ్యమంత్రి పదవి చేజారకుండా కాపాడుకోవాలని రేవంత్ రెడ్డికి హితవు చెప్పారు.
బాపూఘాట్‌లో భారీ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామని హరీష్ రావు ప్రకటించారు. కేసీఆర్ పెట్టిన అంబేద్కర్ విగ్రహానికి దండం పెట్టరని సీఎం రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు గుప్పించారు. అదీకాక.. ప్రజలు సందర్శించే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో తనపై కేసు పెట్టారని హరీష్ రావు ఆరోపించారు. అడ్డుకోబోము అంటూనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి తప్పిదాల వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ దారుణ స్థితికి పడిపోయిందన్నారు. తాను ఫుట్ బాల్ ఆడనని.. క్రికెట్ ఆడుతానని చెప్పిన్న హరీష్ రావు.. వచ్చే ఎన్నికల్లో వికెట్ తీసేది తామేనని అన్నారు. రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఇదే సమయంలో మూసీ నుంచి వాడపల్లి వరకు పాదయాత్ర చేద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌కు హరీష్ రావు ప్రతిసవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌తో పాదయాత్రకు తాము రెడీ అని ప్రకటించారు. రేపా? ఎల్లుండా? టైమ్ చెప్తే కేటీఆర్, తాను.. ఇద్దరం వస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. గన్‌మెన్‌లు లేకుండా రేవంత్ రెడ్డి మూసీపై పాదయాత్రకు రావాలని మాజీ మంత్రి ప్రతి సవాల్ విసిరారు. ఇటీవల మూసీ ఒడ్డున మూడు నెలలు నివాసం ఉండాలని కూడా సీఎం సవాల్ విసిరారని.. దానికి సైతం తాము సిద్ధమని హరీష్ రావు మరోసారి స్పష్టం చేశారు.
Also Read:
జగన్ బెయిల్ రద్దుకు కుట్ర శతాబ్దపు జోక్
ఇంగ్లండ్ నుంచి భారీగా బంగారం తరలింపు
For More Telangana News and Telugu News..
Updated Date - Oct 30 , 2024 | 04:15 PM