ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీ రాజకీయాలు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ మండిపాటు

ABN, Publish Date - Oct 05 , 2024 | 11:30 AM

కాంగ్రెస్.. రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చి ఆ పార్టీ మోసం చేసిందన్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్.. రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చి ఆ పార్టీ మోసం చేసిందన్నారు. “రైతు బంధు ఎగ్గొట్టి, మూసి పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు?.. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రూ.2,500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు?.. అవ్వ, తాతలకు నెలకు రూ.4 వేలు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు?.. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు? .. మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్ష 50 వేల కోట్ల లూటిఫికేషన్‌కు తెరతీసిన ఘనుడు ఎవరు? ” అంటూ కేటీఆర్ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.


బ్లీచింగ్ కొట్టడానికీ డబ్బుల్లేవ్..

బతుకమ్మ పండుగ వేళ గ్రామాల్లో చెరువు వద్ద లైట్లు పెట్టడానికి, పరిశుభ్రత కోసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బుల్లేని పరిస్థితులు వచ్చాయని కేటీఆర్ అన్నారు. ‘బతుకమ్మ అంటే గిట్టదా..పట్టదా ఈ ముఖ్యమంత్రికి? ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా? పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కా చెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాల్నా? పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి.. చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపురించాయి. రాష్ట్ర పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది..? తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం..? ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను.. స్వచ్ఛమైన పరిసరాల్లో జరుపుకునే భాగ్యం కూడా లేదా మహిళలకు? బతుకమ్మ చీరలను ఇవ్వలేదు. ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా..?’ అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..

For Latest news and National News click here

Updated Date - Oct 05 , 2024 | 11:42 AM