ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మండలి ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి బాధ్యతలు

ABN, Publish Date - Oct 14 , 2024 | 03:50 AM

శాసనమండలి ప్రతిపక్ష నేతగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మధుసూదనాచారి బాధ్యతలు స్వీకరించారు.

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): శాసనమండలి ప్రతిపక్ష నేతగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మధుసూదనాచారి బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం మండలి ప్రాంగణంలోని ఆయన చాంబర్‌లో చేపట్టిన ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు హాజరై మధుసూదనాచారిని అభినందించారు. అదేవిధంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీమంత్రి హరీశ్‌ రావు తదితరులు ఆయన్ను సత్కరించి అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, మాజీ మంత్రులు, జగదీశ్‌ రెడ్డి, తలసాని, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2024 | 03:50 AM