ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా హెడ్‌.. కొణతం దిలీప్‌ అరెస్టు

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:46 AM

బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా హెడ్‌ కొణతం దిలీ్‌పను హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైడ్రా, మూసీ సుందరీకరణ, లగచర్ల ఘటనలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ.. సర్కారును అప్రదిష్టపాలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు

  • అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు

  • రిమాండ్‌ను తిరస్కరించిన మెజిస్ట్రేట్‌

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా హెడ్‌ కొణతం దిలీ్‌పను హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైడ్రా, మూసీ సుందరీకరణ, లగచర్ల ఘటనలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ.. సర్కారును అప్రదిష్టపాలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దిలీ్‌పకు నోటీసులివ్వగా.. ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో.. సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దిలీ్‌పను కొన్ని గంటలపాటు విచారించిన పోలీసులు.. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాక.. మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు వారిస్తున్నా.. దిలీప్‌ మీడియాతో మాట్లాడారు.


‘‘నేను ఏ తప్పు చేయకున్నా.. పోలీసులు అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకు కేసు పెట్టారు. అరెస్టు నుంచి రక్షణకు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాను. ఆ ఆదేశాలను పోలీసులు బేఖాతర్‌ చేశారు. పోలీసులు ఏం కేసు పెట్టారో వారికే అర్థం కావడం లేదు. నేను ఇవ్వని వాంగ్మూలాన్ని నమోదు చేసి, సంతకం పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా.. నేను ప్రశ్నిస్తూనే ఉంటా’’ అని స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో.. పోలీసులు దిలీ్‌పను బలవంతంగా కారులో ఎక్కించి, న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులు అందజేసిన రిమాండ్‌ రిపోర్టును పరిశీలించిన మెజిస్ట్రేట్‌.. రిమాండ్‌ను తిరస్కరించారు. దిలీప్‌ అరెస్టును మాజీ మంత్రులు కేటిఆర్‌, హరీశ్‌రావు ఎక్స్‌లో తీవ్రంగా ఖండించారు. ‘‘కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎత్తిచూపినందుకు దిలీ్‌పను అరెస్టు చేశారు’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. విచారణకు పిలిచి, అరెస్టు చేశారని మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఎన్నాళ్లు ఖూనీ చేస్తారని నిలదీశారు.

Updated Date - Nov 19 , 2024 | 01:46 AM