ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Revanth Govt: 317 జీవోపై చర్చకు రేపు కేబినెట్ సబ్ కమిటీ భేటీ

ABN, Publish Date - Jul 18 , 2024 | 09:00 PM

జీవో-317పై కేబినెట్ స‌బ్ క‌మిటీ శుక్రవారం సాయంత్రం 4.00 గంటలకు హైదరాబాద్‌లో భేటీ కానుంది. ఈ జీవో కారణంగా ఉద్యోగుల అభ్య‌ర్థ‌న‌ల‌పై ఈ సబ్ కమిటీ చ‌ర్చించ‌నుంది.

హైదరాబాద్, జులై 18: జీవో-317పై కేబినెట్ స‌బ్ క‌మిటీ శుక్రవారం సాయంత్రం 4.00 గంటలకు హైదరాబాద్‌లో భేటీ కానుంది. ఈ జీవో కారణంగా ఉద్యోగుల అభ్య‌ర్థ‌న‌ల‌పై ఈ సబ్ కమిటీ చ‌ర్చించ‌నుంది. ఇప్ప‌టికే స్పౌజ్‌, మెడికల్‌, మ్యూచువల్‌, కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల భార్య/భర్త చేసుకున్న దరఖాస్తులపై ఈ సబ్ కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. మిగ‌తా దరఖాస్తులపై శాఖ‌ల వారీగా నివేదిక‌లు సిద్ధం చేసింది. అయితే 16వ తేదీ నాటికే జీఏడీకి చేరిన నివేదిక‌లుపై సైతం ఈ స‌బ్ క‌మిటీ చ‌ర్చించనుంది.

Also Read: pocharam srinivas reddy: అందుకే సంబురాలు చేసుకుంటున్నాం


అలాగే 2008 డీఎస్సీ బాధితుల‌కు ఉద్యోగాలు ఇచ్చే అంశంలో విధివిధానాల‌పైనా కూడా ఈ స‌బ్ క‌మిటీ చ‌ర్చించే అవ‌కాశాలున్నాయని తెలుస్తుంది. ఇక బాధితుల‌కు ఆంధ్రప్ర‌దేశ్ త‌ర‌హాలో ఉద్యోగాలు ఇవ్వాల‌ని మార్చి 14వ తేదీ నాటి క్యాబినెట్ భేటీలో నిర్ణ‌యం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకు విధి విధానాల ఖరారు చేసే బాధ్యతను క్యాబినెట్ స‌బ్ క‌మిటీకి ప్రభుత్వం అప్ప‌గించింది. మరోవైపు ఇప్ప‌టికే ఉమ్మ‌డి జిల్లాల వారీగా న‌ష్ట‌పోయిన అభ్య‌ర్థుల వివ‌రాలు విద్యాశాఖ సేక‌రించింది.

Also Read: PoK: భారత్ కోసం.. ‘పాక్ ఆర్మీ’ ఉగ్రవాద శిక్షణ


బాధితుల‌కు ఆరు వారాల్లోగా ఉద్యోగాలు ఇస్తామ‌ని జూన్ 27వ తేదీన హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఆ క్రమంలో ఆగ‌స్టు 8వ తేదీన త‌దుప‌రి విచార‌ణ జ‌రుపుతామని కోర్టు స్పష్టం చేసిన విషయం విధితమే. ఈ నేప‌థ్యంలో ఈ సమావేశంలో డీఎస్సీ 2008 బాధితుల‌కు ఉద్యోగాలు క‌ల్పించే అంశంపై విధివిధానాలు ఖ‌రారు చేసే అవ‌కాశముందని క్లియర్ కట్‌గా స్పష్టమవుతుంది. ఇక కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రులు దామోద‌ర రాజ‌న‌ర్సింహా, శ్రీ‌ధ‌ర్ బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్ తదితరులు హాజరుకానున్నారు.

Also Read: Maharastra: లండన్‌ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ‘వాఘ్ నఖా’.. రేపటి నుంచి ప్రదర్శన

Also Read: Maharastra: లండన్‌ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ‘వాఘ్ నఖా’.. రేపటి నుంచి ప్రదర్శన


2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఆ సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు నాటి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం కొలువు తీరింది. అయితే 2016లో రాష్ట్రంలోని 10 జిల్లాలను 33 జిల్లాలలుగా విభజించింది. కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, మల్టీ జోనులకు ఉద్యోగుల సర్థుబాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Dibrugarh Express accident: రైలు ప్రమాదానికి ముందు భారీ పేలుడు..!


అందులోభాగంగా 2021 డిసెంబర్ 6న జీవో 317ను కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఉద్యోగులు.. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లలో తాము కోరుకున్న చోటుకు వెళ్లేందుకు ఆప్షన్‌ ఎంచుకునే అవకాశం కల్పించింది. అయితే పోస్టింగ్‌ విషయంలో మాత్రం సీనియార్టీకి ప్రిఫరెన్స్‌ ఇవ్వడం వివాదాస్పదమైంది. సీనియర్లు డిమాండ్ ఉన్న చోటుకు వెళ్తే మిగతా వారికి అవకాశం ఉండదు. దాంతో.. సొంత జిల్లాలకు చెందిన వారైనప్పటికీ, కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ లభించదు. ఫలితంగా.. ఉద్యోగుల ప్రమోషన్లు, పే స్కేల్స్ వంటి అంశాలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దాంతో 317 జీవోని ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు.

Also Read:India-Pakistan Border: తుపాకులు, బులెట్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

Also Read: Telangana: చిక్కుల్లో మరో ఐఏఎస్ అధికారి ఫ్రపుల్ దేశాయ్..!


అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే.. జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. తద్వారా మీ సమ్యలన్నీ పరిష్కారమవుతాయని వారికి భరోసా ఇచ్చారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు హస్తం పార్టీకి ఓటు వేయడంతో.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలు క్రమంలో జీవో 317పై వైద్య అరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారథ్యంలో కేబినెట్ సబ్ కమిటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 18 , 2024 | 09:02 PM

Advertising
Advertising
<