ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kaleshwaram: కాళేశ్వరం ఖర్చులపై సంచలన విషయాలు వెల్లడించిన కాగ్

ABN, Publish Date - Jan 14 , 2024 | 08:25 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఒక రూపాయి ఖర్చు చేస్తే.. నికరంగా దాని నుంచి వచ్చే ఆదాయం 52 పైసలు మాత్రమేనని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) స్పష్టం చేసింది. అందువల్ల, ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అంత ప్రయోజనకరం కాదని తేల్చి చెప్పింది.

హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఒక రూపాయి ఖర్చు చేస్తే.. నికరంగా దాని నుంచి వచ్చే ఆదాయం 52 పైసలు మాత్రమేనని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) స్పష్టం చేసింది. అందువల్ల, ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అంత ప్రయోజనకరం కాదని తేల్చి చెప్పింది. ప్రాజెక్టు డీపీఆర్‌ల పరిశీలన మొదలు.. ఖర్చు, బ్యాంకు రుణాలు, అంచనాలపై కొన్ని నెలలుగా అధ్యయనం చేసిన కాగ్‌ ఈ మేరకు ముసాయిదా నివేదికను రూపొందించింది. ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన అంచనాలను తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. ఏటా ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.14,351 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిందని, కానీ, అది రూ.28,270 కోట్లు ఉంటుందని కాగ్‌ అంచనా వేసింది. కాళేశ్వరంలో విద్యుత్తు వినియోగం, స్థిర చార్జీలను కలుపుకొని రూ.10,374 కోట్ల వరకూ ఖర్చవుతుందని లెక్కగట్టింది. కాళేశ్వరంలో విద్యుత్తు వ్యయం కేవలం రూ.4,148 కోట్లుగా సర్కారు అంచనా వేసిందని గుర్తు చేసింది.


అలాగే, ఏమాత్రం ఆదాయం లేని కాళేశ్వరం కార్పొరేషన్‌ నుంచి రుణాలు/అసలు/వడ్డీ చెల్లింపులకు ఏటా ప్రభుత్వం నుంచి రూ.14,462 కోట్లను చెల్లించాలని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దాని పరిధిలో వ్యవసాయోత్పత్తుల విలువ రూ.12,553 కోట్లు ఉంటుందని ప్రభుత్వం నివేదించిందని, కానీ అది రూ.10,577 కోట్లు దాటదని కాగ్‌ లెక్కించింది. ఇక చేపల పెంపకం (ఫిషరీస్‌); పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం కింద రూ.5555 కోట్లు వస్తాయని అంచనా వేసిందని, కానీ, ఆ మొత్తం రూ.1069 కోట్లు మాత్రమేనని తేల్చి చెప్పింది. వెరసి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే వార్షికాదాయాన్ని రూ.21,682 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపించిందని, కానీ అది రూ.14,709 కోట్లు మాత్రమేనని లెక్కకట్టింది. కాళేశ్వరం నిర్మాణానికి రూ.87,449 కోట్ల రుణాలు తీసుకున్నారని, వడ్డీ కింద రూ.54,174 కోట్లు అవుతుందని, అంతిమంగా రూ.1.41 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. అసలు, వడ్డీ చెల్లింపులకు కావాల్సిన ఆర్థిక వనరులు కాళేశ్వరం కార్పొరేషన్‌కు లేవని, వాటిని అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.87 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కొత్తగా సృష్టించిన ఆయకట్టు 40,288 ఎకరాలు మాత్రమేనని కాగ్‌ గుర్తు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్‌లలో లోపాలున్నాయని పేర్కొంది.

Updated Date - Jan 14 , 2024 | 08:25 AM

Advertising
Advertising