TS News: మహిళ మెడికల్ ఆఫీసర్‌లపై లైంగిక వేధింపులు.. కామారెడ్డి డీఎంహెచ్‌ఓపై కేసు..
ABN, Publish Date - May 16 , 2024 | 11:16 AM
మహిళ మెడికల్ ఆఫీసర్లను కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ లక్ష్మణ్ సింగ్ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయమై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా మెడికల్ ఆఫీసర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద 7 కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.
కామారెడ్డి: మహిళ మెడికల్ ఆఫీసర్లను కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ లక్ష్మణ్ సింగ్ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయమై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా మెడికల్ ఆఫీసర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద 7 కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. తమను ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో మహిళ మెడికల్ ఆఫీసర్లు పేర్కొన్నారు. డీఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్‌ను దేవునిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
AP News: అలిపిరి వద్ద కారు దగ్ధం..
కామారెడ్డి డీఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది కాలంగా తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మహిళ మెడికల్ ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర వైద్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు, వేధింపుల ఘటనపై డీఎంహెచ్ఓపై ఉన్నతాధికారులు సైతం ఫైర్ అయ్యారు. లైంగిక వేధింపుల ఘటనపై డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ అడిషనల్ డైరక్టర్ అమర్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ విచారణలో తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారని 10 మందికి పైగా మహిళా మెడికల్ ఆఫీసర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి...
TDP: టీడీపీ మహానాడు వాయిదా.. రీజన్ ఇదే!
AP News: రెచ్చిపోతున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు
Read Latest AP News AND Telugu News
Updated Date - May 16 , 2024 | 11:16 AM