CBSE : డిసెంబరు 1న సీటెట్
ABN, Publish Date - Sep 18 , 2024 | 05:36 AM
జాతీయ స్థాయి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీ టెట్)ను డిసెంబరు 1న నిర్వహించనున్నట్లు సీబీఎ్‌సఈ ప్రకటించింది.
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీ టెట్)ను డిసెంబరు 1న నిర్వహించనున్నట్లు సీబీఎ్‌సఈ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పరీక్ష కోసం అభ్యర్థులు అక్టోబరు 16లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. డిసెంబరు 1న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-2 పరీక్షను, సాయంత్రం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్-1 పరీక్షను నిర్వహించనున్నారు. దరఖాస్తు చేయడానికి జనరల్ కేటగిరీ, ఓబీసీ అభ్యర్థులు ఒక్క పేపర్‌కు అయితే.. రూ.1000, రెండు పేపర్లకు అయితే రూ.1200 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500, రూ.600 చొప్పున చెల్లించాలి. కాగా, రాష్ట్రంలోని వివిధ గురుకులాల్లో పీఈటీ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు టీజీపీఎస్సీ అధికారులు వెల్లడించారు.
Updated Date - Sep 18 , 2024 | 05:37 AM