Email Policy: ఉద్యోగులకు ప్రభుత్వ ఈ-మెయిల్
ABN, Publish Date - Oct 31 , 2024 | 04:05 AM
ఇక నుంచి ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారంతా తమ అధికార ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) ఈ-మెయిల్ ద్వారానే చేయాల్సి ఉంటుంది.
ఇకనుంచి అధికారిక కార్యకలాపాలన్నీ జౌఠి.జీుఽ ద్వారానే
‘ఈ-మెయిల్’ పాలసీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, అక్టోబర్ 30 (ఆంధ్రజ్యోతి): ఇక నుంచి ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారంతా తమ అధికార ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) ఈ-మెయిల్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఈ-మెయిల్ పాలసీ విడుదల చేసింది. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ శాఖలు, రంగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులంతా ఎన్‌ఐసీ ఈ-మెయిల్‌నే వాడాల్సి ఉంటుంది. ఎన్‌ఐసీ ఆద్వర్యంలోని ప్రభుత్వ ఈ-మెయిల్ ఎప్పటినుంచో అందుబాటులో ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు ఇతర జిల్లా స్థాయి అధికారులకు జౌఠి.జీుఽ తో ముగిసే ఈ-మెయిల్ గతంలోనే కేటాయించినా ఎవరూ ఉపయోగించడం లేదు.
అధికారిక ఈ-మెయిళ్లకు కూడా జీ-మెయిల్ లాంటి ప్రైవేటు వాటినే వినియోగిస్తున్నారు. జాతీయ భద్రత, సైబర్ సెక్యూరిటీ అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ-మెయిల్ పాలసీ ప్రకటించింది. దీని ప్రకారం ప్రభుత్వ ఈ-మెయిల్ వినియోగం తప్పనిసరి కానుంది. కొత్త పాలసీలో ప్రభుత్వ శాఖల వారీగా మెయిల్ కేటాయిస్తారు. ఉదాహరణకు.. ఐపీఎస్ అధికారులకు హోదా పేరుతో ips.gov.in కేటాయిస్తారు. పదవీవిరమణ పొందాక పెన్షన్ ఇతర ప్రభుత్వ ప్రయోజనాల నిమిత్తం అధికార మెయిళ్ల కోసం retiredips.gov.in కేటాయిస్తారు. పంచాయతి సిబ్బందికి panchayat.gov.in ప్రభుత్వ రంగాల్లో పనిచేసే కాంట్రాక్టు సిబ్బందికి contracter.gov.in, లాంటి శాఖల వారీగా వేర్వేరు ఈ-మెయిళ్లు కేటాయిస్తారు.
తమ శాఖ ఆధ్వర్యంలో అధికారిక ఈ-మెయిల్ కేటాయించే అధికారాన్ని జాయింట్ సెక్రటరీ స్థాయి, అంతకంటే పైస్థాయి అధికారికి కేటాయించారు. జౌఠి.జీుఽ మెయిళ్లన్నీ ఎన్‌ఐసీ పర్యవేక్షిస్తుంది. భద్రతకు సంబంధించిన అనుమానాస్పద ఈ-మెయిళ్లను గుర్తించి తొలగిస్తుంది. ప్రభుత్వం ఒకసారి ఈ-మెయిల్ కేటాయించాక అధికారిక మెయిళ్లకు వాటినే వినియోగించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 90 రోజులు వినియోగించకుంటే ఈ-మెయిల్ రద్దవుతుంది. ఆ తర్వాత పునరుద్ధరణకు సహేతుక కారణాలు చూపించి దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే gov.in.nic.in అధికారిక మెయిల్ వినియోగించే ప్రభుత్వ ప్రతినిధులు.. కొత్త విధానంలోకి అనుసంధానిస్తారు.
Updated Date - Oct 31 , 2024 | 04:05 AM