ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lift Irrigation: చిన్న కాళేశ్వరానికి కేంద్రం సాయం

ABN, Publish Date - Dec 05 , 2024 | 03:26 AM

తెలంగాణలో మరో నీటిపారుదల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సాయం అందనుంది. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలో చిన్నకాళేశ్వరం(ముక్తేశ్వర్‌) ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం పచ్చజెండా ఊపింది.

హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మరో నీటిపారుదల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సాయం అందనుంది. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలో చిన్నకాళేశ్వరం(ముక్తేశ్వర్‌) ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రధాన మంత్రి కృషి సింఛాయీ యోజన(పీఎంకేఎ్‌సవై - గతంలో ఏఐబీపీ) కింద రూ.233 కోట్లను మంజూరు చేయనుంది. ఈ ప్రాజెక్టు సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌ )కు సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) సహా.. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లోని డైరెక్టరేట్లన్నీ ఈ డీపీఆర్‌ను ఆమోదించాయి.


పీఎంకేఎ్‌సవైలో భాగంగా ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో ఆదివాసీ ప్రాంతాల్లో కేంద్రం 90% నిధులను అందజేస్తుంది. మిగతా 10శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో ఈ వాటా 60-40శాతంగా ఉంటుంది. అయితే.. చిన్న కాళేశ్వరం పూర్తిగా ఆదివాసీ ప్రాంతంలో ఉండడం.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.537 కోట్లు కావడంతో.. 90ు నిధులను కేంద్రం నుంచి రాబట్టాల్సి ఉంటుంది. కాగా.. మొడికుంట వాగు ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.463 కోట్లను అందజేసేందుకు కేంద్రం వెల్లడించగా.. చనాకా-కొరాటకు రూ.172 కోట్లు రానున్నాయి. ఈ మూడు ప్రాజెక్టులకు మొత్తంగా రూ.868 కోట్లు వచ్చే అవకాశాలున్నాయి.

Updated Date - Dec 05 , 2024 | 03:26 AM