ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandra Bose: ‘మాటిచ్చా.. సరస్వతి గుడిని నిర్మించా’

ABN, Publish Date - Jul 04 , 2024 | 11:28 AM

ఆస్కార్‌ అవార్డు గ్రహీత, సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్‌(Kankuntla Chandra Bose) తన గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తన స్వగ్రామం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలో సొంత నిధులతో ఆస్కార్‌ పేరిట ఓ గ్రంథాలయాన్ని నిర్మించారు.

- ‘ఆంధ్రజ్యోతి’తో సినీ గేయ రచయిత చంద్రబోస్‌

- ఆయన స్వగ్రామం చల్లగరిగలో ‘ఆస్కార్‌ గ్రంథాలయం’

చిట్యాల(భూపాలపల్లి): ఆస్కార్‌ అవార్డు గ్రహీత, సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్‌(Kankuntla Chandra Bose) తన గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తన స్వగ్రామం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలో సొంత నిధులతో ఆస్కార్‌ పేరిట ఓ గ్రంథాలయాన్ని నిర్మించారు. ఈ ఆస్కార్‌ గ్రంథాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో బుధవారం ఫోన్‌లో మాట్లాడిన చంద్రబోస్‌.. ‘గ్రామస్థులకు ఇచ్చిన మాట ప్రకారం సరస్వతి గుడిని నిర్మించా. చాలా సంతోషంగా ఉంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. చల్లగరిగలోని తమ ఇంటి పక్కన ఉన్న గ్రంథాలయంలో ఎన్నో సాహిత్య పుస్తకాలు చదివానని, వాటి వల్లే తాను ఉన్నతస్థాయికి ఎదిగానని ఈ సందర్భంగా చెప్పారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం


ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు తాను రాసిన నాటునాటు పాటకు ఆస్కార్‌ అవార్డు రావడంతో బాల్య మిత్రులు, గ్రామ ప్రజలు తనని సన్మానించారని చెప్పారు. ఆ సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ గ్రామంలో అత్యాధునిక హంగులతో గ్రంథాలయ భవనం నిర్మిస్తానని ఇచ్చిన మాటను ఈ రోజున నిలబెట్టుకున్నానని వివరించారు. అందరి సహకారంతో రూ. 36లక్షల వ్యయంతో ఎనిమిది నెలల్లో భవనాన్ని సిద్ధం చేసి ఆస్కార్‌ గ్రంథాలయం అని నామకరణం చేశామని చెప్పారు. కాగా, రచయిత చంద్రబోస్‌ తన సొంత నిధులతో నిర్మించిన ఆస్కార్‌ గ్రంథాలయ ప్రారంభోత్సవం గురువారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని గ్రంథాలయాల జిల్లా కార్యదర్శి శ్రీలత తెలిపారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 04 , 2024 | 11:30 AM

Advertising
Advertising