ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Warangal: చపాట మిర్చికి జీఐ ట్యాగ్‌

ABN, Publish Date - Dec 07 , 2024 | 04:10 AM

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మాత్రమే పండిస్తున్న చపాట మిర్చి అరుదైన ఖ్యాతిని సాధించింది. ఎర్రటి రంగుతోపాటు తక్కువ మోతాదులో కారం ఉండే ఈ రకం మిరప.. తాజాగా జీఐ (జియోగ్రాఫిక్‌ ఇండికేషన్‌) ట్యాగ్‌ను సాధించింది.

  • తక్కువ కారం, ఎర్రటి రంగు ఈ రకం ప్రత్యేకత

వరంగల్‌ వ్యవసాయం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మాత్రమే పండిస్తున్న చపాట మిర్చి అరుదైన ఖ్యాతిని సాధించింది. ఎర్రటి రంగుతోపాటు తక్కువ మోతాదులో కారం ఉండే ఈ రకం మిరప.. తాజాగా జీఐ (జియోగ్రాఫిక్‌ ఇండికేషన్‌) ట్యాగ్‌ను సాధించింది. చపాట మిరపకు జీఐ ట్యాగ్‌ కోసం తిమ్మంపేట మిర్చి ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ రెండేళ్ల క్రితం దరఖాస్తు చేయగా.. ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీ స్‌(ఐపీవో) తాజాగా ఆమోదించింది.


‘జియోగ్రాఫిక్‌ ఇండికేషన్స్‌ జర్నల్‌’లోనూ చపాట రకం మిర్చికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. చపాట రకం మిరపకాయలు టమోటా మాదిరిగా ఉంటాయి. అందుకే దీన్ని టమోటా మిరప అని కూడా పిలుస్తారు. రెండేళ్ల క్రితం చపాట మిర్చికి వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.లక్ష వరకు ధర పలికింది. తాజాగా జీఐ ట్యాగ్‌తో ఈ రకం మిర్చి ప్రత్యేక గుర్తింపు సాధించినట్లయింది.

Updated Date - Dec 07 , 2024 | 04:10 AM