Big Breaking: వార్ జోన్‌గా ఛత్తీస్‌గడ్ దండ కారణ్యం.. ఆరుగురు మావోల మృతి
ABN, Publish Date - Mar 27 , 2024 | 11:54 AM
ఛత్తీస్‌గడ్ దండ కారణ్యం వార్ జోన్‌గా మారింది. మావోయిస్టుల ఏరివేత టార్గెట్‌గా పోలీస్ బలగాల కూంబింగ్ నిర్వహిస్తున్నారు. బీజాపూర్ జిల్లా బాసగూడ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్ట్‌లు మృతి చెందారు. మావోలపై భద్రతా బలగాలు ఆధిపత్యం సాగిస్తున్నాయి.
ఛత్తీస్‌గడ్: ఛత్తీస్‌గడ్ (Chattisgarh) దండ కారణ్యం వార్ జోన్ (War Zone)గా మారింది. మావోయిస్టుల ఏరివేత టార్గెట్‌గా పోలీస్ బలగాల కూంబింగ్ నిర్వహిస్తున్నారు. బీజాపూర్ జిల్లా బాసగూడ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్ట్‌లు (Mavoists) మృతి చెందారు. మావోలపై భద్రతా బలగాలు ఆధిపత్యం సాగిస్తున్నాయి. పరిస్థితి చేయి దాటడంతో మావోయిస్టులు చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ఫ్ చర్చలకు సిద్ధమంటూ లేఖ విడుదల చేశారు. ఈ నెల 30న బీజాపూర్ జిల్లా బంద్ కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. వేసవి కాలం కావడంతో భద్రతా బలగాలకు అనుకూలంగా కూంబింగ్ మారింది. ఆపరేషన్ అబూజ్‌మడ్ టార్గెట్‌గా భద్రతా బలగాలు ముందుకు వెళుతున్నాయి. తెలంగాణ (Telangana) నివురు గప్పిన నిప్పులా మారింది.
Sania Mirza: కాంగ్రెస్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా..?
చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ (Encounter)లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం. ఇప్పటి వరకూ ఒక డిప్యూటీ కమాండర్ సహా ఆరుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. నక్సలైట్లలో ఒక మహిళా నక్సలైట్ మృతదేహం కూడా ఉంది. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్ సుక్మా సరిహద్దు ప్రాంతంలో చీపుర్‌భట్టి ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. కోబ్రా 210, 205 సీఆర్పీఎఫ్ 229 బెటాలియన్, డీఆర్‌జీ జవాన్లు భద్రతా దళాల బృందంలో ఉన్నారు. హతమైన నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలంలో ఉన్న ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, కోబ్రా సీఆర్పీఎఫ్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. హోలీ రోజున నక్సలైట్లు ఈ ప్రాంతంలో ముగ్గురు గ్రామస్థులను చంపారు.
Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ముద్దాయిగా చేర్చాలి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 27 , 2024 | 11:55 AM