ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: సీఎంఆర్‌ఎఫ్ విరాళాలు ఇవ్వండి..

ABN, Publish Date - Sep 05 , 2024 | 03:50 AM

వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

  • ఇది మానవత్వం చూపాల్సిన సమయం..

  • వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలవండి

  • సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు, ఇతర రంగాల్లోని ప్రముఖులు స్పందించాలని కోరారు. తెలంగా ణ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎ్‌ఫ)కి విరాళాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విరాళాలను ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, చెక్కుల రూపంలో లేదా యూపీఐ పేమెంట్‌ యాప్స్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి విరాళాలు అందించవచ్చన్నారు. ‘‘వరద బాధితులను ఆదుకోవడానికి చేత నైనంత సాయం అందించండి. ఇది మానవత్వం ప్రదర్శించాల్సిన సమయం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారని సీఎంవో ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేసింది.


  • విరాళాలు ఇవ్వాలంటే ఇలా..

http//cmrf.tsonline.govt.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. సీఎంఆర్‌ఎఫ్‌ విభాగంలోకి వెళ్లి విరాళం చెల్లింపుల ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇందులో ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ (ఆర్టీజీఎస్‌, నెఫ్ట్‌, ఐఎంపీఎస్‌), యూపీఐ, చెక్కు రూపంలో చెల్లించే వివరాలు ఉంటాయి.


  • ఆన్‌లైన్‌ చెల్లింపులకు..

ఖాతా నంబర్‌: 62354157651, ఖాతా పేరు: సీఎం రిలీఫ్‌ ఫండ్‌, బ్యాంక్‌: స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్రాంచ్‌: సెక్రటేరియట్‌, హైదరాబాద్‌, తెలంగాణ, బ్రాంచ్‌ కోడ్‌: 020077, ఐఎ్‌ఫఎస్సీ కోడ్‌: ఎస్‌బీఐఎన్‌0020077లతో విరాళం చెల్లించవచ్చు. ఇవే వివరాలను నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులకు వినియోగించవచ్చు.


  • చెక్కు, డీడీ రూపంలో అయితే..

పేయి నేమ్‌: ‘‘సీఎం రిలీఫ్‌ ఫండ్‌, తెలంగాణ స్టేట్‌’’ అని చెక్కు, డీడీపై రాయాలి. చిరునామా: సీఎం రిలీఫ్‌ ఫండ్‌, డాక్టర్‌.బీ.ఆర్‌.అంబేడ్కర్‌ తెలంగాణ సెక్రటేరియట్‌, హైదరాబాద్‌, 500022కు పంపాలి.


  • యూపీఐ ద్వారా...

గూగుల్‌, ఫోన్‌పే, ఇతర యూపీఐ యాప్స్‌ ద్వారా చెల్లింపు చేయాలంటే వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే.. ఎస్‌బీఐ లోగో ఉండటంతోపాటు మర్చంట్‌ పేరు: తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌, యూపీఐ ఐడీ: ్టజఛిఝట్ఛజూజ్ఛీజజఠుఽఛీఃటఛజీ అని రాసి.. ఒక క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. ఆ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి కూడా విరాళాలను ఇవ్వవచ్చు.

Updated Date - Sep 05 , 2024 | 03:50 AM

Advertising
Advertising