ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rain Updates: భారీ వర్షాల వేళ ఇరిగేషన్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ABN, Publish Date - Sep 01 , 2024 | 04:25 PM

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వరదలు ముంచెత్తున్నాయి. దాదాపు చెరువులన్నీ నిండిపోగా.. నదులు, వాగులు, వంకలు వరదలతో ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వరదలు ముంచెత్తున్నాయి. దాదాపు చెరువులన్నీ నిండిపోగా.. నదులు, వాగులు, వంకలు వరదలతో ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవాలంటూ ఇరిగేషన్ అధికారులను సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచన చేశారు.


ఎగువన కురిసిన వర్షాలతో పాటు కడెం నుంచి వస్తున్న వరదతో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. దీంతో ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. మరోవైపు ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయాలని, రోజుకు ఒక టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని అధికారులు ఆదేశించారు. నంది, గాయత్రి పంప్ హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయక్‌ సాగర్‌, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు.


ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్ధ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.45 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి ప్రవాహం ఉద్ధృతంగా వస్తుండటంతో నంది, గాయత్రి పంప్ హౌస్‌ల ద్వారా మిడ్ మానేరుకు నీటిని అధికారులు పంపిస్తున్నారు. ఇక మిడ్‌మానేరు ప్రాజెక్టు సామర్ధ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అక్కడి నుంచి 14 వేల క్యూసెక్కులకు పైగా లోయర్ మానేరు డ్యామ్‌కు, మరో 6,400 క్యూసెక్కులు అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా రంగనాయక్‌ సాగర్‌కు తరలిస్తున్నారు.


మరోవైపు రంగ నాయక సాగర్ నుంచి నీటిని పంపింగ్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని, అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్ట్, నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరకు నీటిని తరలించాలని ఆదేశించారు. కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో సాధ్యమైనంత వరకు నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మల్లన్నసాగర్‌లో గరిష్ఠంగా 18 నుంచి 20 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్‌లో 10 టీఎంసీలు నిల్వ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అన్ని ముందు జాగ్రత్తలు పాటించాలని ఆయన అప్రమత్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించాలని ఆయన సూచనలు చేశారు.

Updated Date - Sep 01 , 2024 | 04:25 PM

Advertising
Advertising