ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana Formation Day: సోనియాతో భేటీ అయిన రేవంత్.. ఎందుకంటే?

ABN, Publish Date - May 28 , 2024 | 05:16 PM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana Formation Day) వేడుకలకు(జూన్ 2) కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని(Sonia Gandhi) ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana Formation Day) వేడుకలకు(జూన్ 2) కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని(Sonia Gandhi) ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా రేవంత్.. సోనియాను ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయినందునా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సోనియాతో అరగంటపాటు సమావేశమై పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానించారు. పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.


ప్రముఖ కవి అందెశ్రీ రచించిన తెలంగాణ అధికారిక గీతాన్ని సోనియా గాంధీ సమక్షంలో వేడుకల్లో ఆవిష్కరించనున్నట్లు సీఎం క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర గీతానికి కీరవాణి సంగీతం అందించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ, తెచ్చిన క్రెడిట్‌ని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత తన ఖాతాలో వేసుకున్నారు. అలా దాదాపు 10 సంవత్సరాలు ఆయన రాష్ట్రాన్ని పాలించారు.

రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి ప్రజలు తొలిసారి అధికారం కట్టబెట్టారు. దీంతో రాష్ట్ర దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. కార్యక్రమాన్ని గ్రాండ్‌గా సక్సెస్‌ చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 05:34 PM

Advertising
Advertising