ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: అధికారులూ.. జాగ్రత్త!

ABN, Publish Date - Sep 02 , 2024 | 03:58 AM

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో వరదలు వస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

  • 24 గంటలూ అప్రమత్తంగా ఉండండి

  • సెలవులో ఉన్నవారు రద్దు చేసుకొని రండి

  • వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్‌ ఆదేశం

  • టెలీకాన్ఫరెన్స్‌.. మంత్రులకూ సూచనలు

  • అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు

  • వరద నీటిని ఒడిసిపట్టేలా చర్యలు: ఉత్తమ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో వరదలు వస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 24 గంటలూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఆదివారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మునిసిపల్‌, విద్యుత్తు, పంచాయతీరాజ్‌, హైడ్రా, ఇరిగేషన్‌ శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అదే విధంగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మం త్రులు తుమ్మల, ఉత్తమ్‌, దామోదర, జూపల్లి, పొంగులేటితో ఫోన్‌లో మాట్లాడి, వారిని అప్రమత్తం చేశారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అన్ని శాఖల అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని, ఇప్పటికే ఎవరైనా సెలవులపై ఉంటే రద్దు చేసుకుని వెంటనే విధులకు హాజరవ్వాలని సూచించారు.


అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్‌ చేయాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించినట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్‌ పిలుపునిచ్చారు.


  • వరద నీటిని ఒడిసి పట్టుకుందాం: ఉత్తమ్‌

భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వరద నీటిని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నిల్వ చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండడంతో గేట్లు ఎత్తి, నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఆ నీటిని వీలైనంత మేరకు ఎత్తిపోయాలని, రోజుకు ఒక టీఎంసీ తగ్గకుండా నంది, గాయత్రి పంప్‌హౌ్‌సల ద్వారా లిఫ్ట్‌ చేసి రిజర్వాయర్లను నింపాలని ఉత్తమ్‌ సూచించారు. మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌ వరకు జలాశయాల్లోకి కూడా నీటిని ఎత్తిపోయాలని ఆయన ఆదేశించారు.

Updated Date - Sep 02 , 2024 | 03:58 AM

Advertising
Advertising