ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: సీఎం సంతకం చేసినా బదిలీల్లేవ్‌!

ABN, Publish Date - Oct 16 , 2024 | 04:26 AM

సచివాలయంలో సెక్షన్‌ అధికారుల (ఎస్‌వో)ను వెంటనే బదిలీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సెప్టెంబరు 30నే సంబంధిత ఫైలుపై సంతకం కూడా చేశారు.

  • ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య విభేదాలు..

  • ఆగిన సచివాలయ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్లు

  • గత నెల 30నే ఆమోదం

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలో సెక్షన్‌ అధికారుల (ఎస్‌వో)ను వెంటనే బదిలీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సెప్టెంబరు 30నే సంబంధిత ఫైలుపై సంతకం కూడా చేశారు. రెండు వారాలు దాటినా.. ఇప్పటికీ బదిలీలు జరగలేదు. ఈ జాప్యానికి ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య భేదాభిప్రాయాలే కారణమని తెలుస్తోంది. అన్ని శాఖల్లోనూ ఏళ్లతరబడి ఒకే చోట కొనసాగుతున్న ఉద్యోగులందరినీ బదిలీ చేయాలని ఒక ఉన్నతాధికారి ఫైల్‌ సిద్ధం చేశారు. అయితే కొన్ని శాఖల్లో ధీర్ఘకాలంగా ఉన్న వారిని కూడా బదిలీ చేయొద్దని మరో ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.


ఇద్దరి మధ్య పంచాయితీ తేలకపోవడంతో బదిలీల ఫైల్‌కు మోక్షం లభించడం లేదు. దసరాలోపే బదిలీలు పూర్తవుతాయని సచివాలయ ఉద్యోగులు భావించినా ఇప్పటికీ ఆ వ్యవహారం కొలిక్కి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పదేళ్లలో ఒక్కసారి కూడా సచివాలయ ఉద్యోగుల బదిలీలు జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి ప్రాధాన్య శాఖల్లో కొనసాగుతున్న ఉద్యోగులను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా మార్చకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బదిలీలు జరుగుతాయని ఆశించారు. పది నెలలైనా కదలిక లేకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తొలుత ఎస్‌వో క్యాడర్‌లో బదిలీలు చేయాలని రేవంత్‌ సర్కారు నిర్ణయించింది.


  • 180 మంది ఎస్‌వోల బదిలీకి ఆమోదం

సచివాలయ నిబంధనల ప్రకారం మూడు రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి. సెప్టెంబరు 30న సీఎం రేవంత్‌రెడ్డి ఫైల్‌ మీద సంతకం చేశారు. సుమారు 180 మంది ఎస్‌వోలను ఫోకల్‌, నాన్‌ఫోకల్‌, సెమీ ఫోకల్‌గా విభజించి బదిలీ చేయాలని సూచించారు. దీనిపై వారం రోజుల పాటు జీఏడీ అధికారులు కసరత్తు చేశారు. 180 మంది ఉద్యోగుల వివరాలతో బదిలీల ప్రతిపాదనలు ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లాయి. కానీ, ఫైల్‌ ముందుకు కదల్లేదు. ఇందుకు అధికారుల మధ్య విభేదాలే కారణమని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.


సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చినా సకాలంలో బదిలీలపై నిర్ణయం తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు తమకు అనుకూలమైన వ్యక్తుల బదిలీలు జరగకుండా అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎస్‌వోల బదిలీల ప్రక్రియ జాప్యం కావడంతో సహాయ కార్యదర్శి నుంచి ఆ పై స్థాయిలో ఉండే కార్యదర్శుల బదిలీలు నిలిచిపోయాయి. వీటిపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Oct 16 , 2024 | 04:26 AM