ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి

ABN, Publish Date - Dec 08 , 2024 | 03:24 AM

‘ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి. సమస్త ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడమే నాకు సంప్రాప్తి’ అని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

  • ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే సంప్రాప్తి

  • ఎక్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి. సమస్త ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడమే నాకు సంప్రాప్తి’ అని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి శనివారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశారు. పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు, ఆత్మ బలిదానాలు, ఆకాంక్షలు, ఆశయాలన్నింటినీ కలిపి వీలునామాగా రాసి 2023 డిసెంబరు 7న తెలంగాణ తన చేతుల్లో పెట్టిందని, వారసత్వాన్ని సగర్వంగా, సమున్నతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను రాష్ట్రం తనకు అప్పగించిందని వివరించారు.


ఆ క్షణం నుంచి.. జనసేవకుడిగా ప్రజాసంక్షేమ శ్రామికుడిగా.. మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో సకల జనహితమే పరమావధిగా పని చేస్తున్నానని పేర్కొన్నారు. ‘జాతి ఆత్మ గౌరవమే ప్రాధాన్యతగా.. సహచరుల సహకారంతో.. జనహితుల ప్రోత్సాహంతో.. విమర్శలను సహిస్తూ.. విద్వేషాలను ఎదిరిస్తూ.. స్వేచ్ఛకు రెక్కలు తొడిగి ప్రజాస్వామ్యానికి రెడ్‌కార్పెట్‌ పరిచి.. అవనిపై అగ్రభాగాన.. తెలంగాణను నిలిపేందుకు గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ.. నాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూ.. నిరంతరం జ్వలించే ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా విరామం ఎరుగక.. విశ్రాంతి కోరక ముందుకు సాగిపోతున్నాను’ అని తెలిపారు. గతేడాది డిసెంబరు 7న తన ప్రమాణ స్వీకారం వీడియోను కూడా ఎక్స్‌లో పోస్టు చేశారు.

Updated Date - Dec 08 , 2024 | 03:25 AM