Osmania Hospital: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం సమీక్ష
ABN, Publish Date - Dec 01 , 2024 | 09:31 PM
అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఆ ఆసుపత్రి భవనం శిథిలావవస్థకు చేరింది. ఇది హెరిటేజ్ భవనాల జాబితాలో ఉండడంతో కూల్చివేతకు అవరోధం ఏర్పడింది.
హైదరాబాద్, డిసెంబర్ 01: నగరంలోని గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉస్మానియా ఆసుపత్రి పనులకు సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రహదారులపై ఆయన పలు కీలక సూచనలు చేశారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్
ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు.. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర పనుల కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అందుకోసం అన్ని శాఖలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read: ట్రంప్ నిర్ణయం.. మరో భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు
ఉస్మానియా ఆసుపత్రిని గోషా మహాల్ స్టేడియంకు తరలించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. గోషా మహాల్‌లో దాదాపు 32 ఎకరాల్లో పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కొత్త ఆసుపత్రిని నిర్మించాలని.. ఆ క్రమంలో అందుకు సంబంధించిన స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు బదిలి చేయాలని అధికారులకు గతంలో సీఎం ఆదేశించిన విషయం విధితమే.
Also Read : తీరం దాటిన ఫెంగల్ తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు
ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.రాబోయే 50 ఏళ్ల అవసరాలను బేరేజు వేసుకుని కొత్త ఆసుపత్రికి రూప కల్పన చేయాలన్నారు. ఆసుపత్రికి నాలుగు వైపులా రహదారులు ఉండేలన్నారు.
Also Read: ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ లేఖ
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని తెలిపారు. ఇక గోషామహాల్‌లోని పోలీస్ స్టేడియం వైద్య ఆరోగ్య శాఖకు బదలాయించడంతో.. ప్రత్యామ్నాయ స్థలాన్ని పోలీస్ శాఖకు కేటాయించాలని సీఎం ఆదేశించారు.
Also Read: పోలి పాడ్యమి రోజు.. ఇలా చేస్తే..
అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఆ ఆసుపత్రి భవనం శిథిలావవస్థకు చేరింది. ఇది హెరిటేజ్ భవనాల జాబితాలో ఉండడంతో కూల్చివేతకు అవరోధం ఏర్పడింది. దీంతో సుమారు నాలుగేళ్ల క్రితం నాటి సీఎం కేసీఆర్.. ఈ భవనాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకోగా.. నేటికి కొత్త భవనం నోచుకోలేదు.
Also Read: చికెన్ ధరలకు రెక్కలు..!
అయితే ఆ భవనంలో ఆసుపత్రి కొనసాగుతుంది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు.. ఇక్కడ పనిచేసే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం మారడంతో.. సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఉస్మానియా ఆసుపత్రి గోషా మహల్ స్టేడియంలో నిర్మించాలని నిర్ణయించారు.
For Telangana News And Telugu News
Updated Date - Dec 01 , 2024 | 09:34 PM