ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth Reddy: పనే ధ్యానం..

ABN, Publish Date - May 24 , 2024 | 05:18 AM

గౌతమ బుద్ధుడు చేసిన బోధనల్లో ‘ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు.. ప్రతీ పనిని ధ్యానంగా చేయాలి’ అనే బోధన తనకు ఎంతో ఇష్టమైనదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇది పైకి రెండు లైన్లుగా కనిపిస్తుందిగానీ, అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానమంతా అందులో ఉందన్నారు.

  • బుద్ధుడి బోధనలే స్ఫూర్తి.. వాటిని ఆచరిస్తున్నా

  • 2,500 ఏళ్ల తర్వాత కూడా ఆదర్శంగా బౌద్ధం

  • నేటి విద్వేష వాతావరణంలో ఎంతో అవసరం

  • ప్రపంచ స్థాయి కార్యక్రమం ఏర్పాటుచేయండి

  • వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా సహకారం అందిస్తా

  • బుద్ధ పౌర్ణమి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి

మారేడుపల్లి, నాగార్జునసాగర్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): గౌతమ బుద్ధుడు చేసిన బోధనల్లో ‘ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు.. ప్రతీ పనిని ధ్యానంగా చేయాలి’ అనే బోధన తనకు ఎంతో ఇష్టమైనదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇది పైకి రెండు లైన్లుగా కనిపిస్తుందిగానీ, అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానమంతా అందులో ఉందన్నారు. ఈ బోధన నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని, పని చేసేటప్పుడు పూర్తిస్థాయిలో కాకపోయినా, కొంతమేరకైనా ధ్యానంగానే పని చేస్తానని తెలిపారు. గౌతమ బుద్ధుడు బోధించిన శాంతి, సహనం, అనురాగం, ప్రేమ, ఐకమత్యం అనే భావనలను తాను పూర్తిగా విశ్వసిస్తూ జీవితంలో ఆచరిస్తున్నానని సీఎం వెల్లడించారు.


సికింద్రాబాద్‌లోని మహేంద్రహిల్స్‌లో ఉన్న మహాబోధి బుద్ధవిహార్‌లో గురువారం జరిగిన బుద్ధ పౌర్ణమి (బుద్ధుడి జన్మదిన) వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుద్ధుడి బోధనలు అమూల్యమైన సందేశాన్ని కలిగి ఉంటాయన్నారు. రాజ్యం, అధికారం, కుటుంబం.. అన్నింటినీ 29 ఏళ్ల చిన్న వయసులో సిద్ధార్థుడు తృణప్రాయంగా వదిలేసి సమాజంలో శాంతి స్థాపన కోసం బయల్దేరాడని గుర్తు చేశారు. బిహార్‌లోని గయలో మొదలైన బౌద్ధం 2,500 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచానికి నేటికీ ఆదర్శంగా నిలుస్తోందని, బౌద్ధం గొప్పతనం దీని ద్వారా తెలుస్తుందని సీఎం చెప్పారు.


దేశానికి బౌద్ధ సందేశం చాలా అవసరం

ప్రస్తుతం మన దేశంలో, రాష్ట్రంలో భావోద్వేగాల ఆధారంగా మనుష్యుల మధ్య వైషమ్యాలను పెంచే పరిస్థితులు నెలకొన్నాయని ఇటువంటి సందర్భంలో బుద్ధుని సందేశం దేశానికి చాలా అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సమాజంలో పెరుగుతున్న అశాంతి, అసూయ వంటి ధోరణులను అధిగమించి సమాజానికి మేలు చేకూర్చే మంచి ఆలోచనలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు బుద్ధుడి బోధనలతో కూడిన పాఠశాలలను ఏర్పాటు చేయాలని సూచించారు. బుద్ధుడి సందేశాన్ని సమాజంలో ప్రతీ ఒక్కరికి చేరవేయడానికి తాను వ్యక్తిగతస్థాయిలోనూ, ప్రభుత్వ పరంగానూ అవసరమైన సహాయ సహకారాలను అందిస్తానని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బౌద్ధ బిక్షువులకు తగిన గౌరవం ఉంటుందని చెప్పారు.


ప్రపంచ దేశాల్లోని బౌద్ధ బిక్షువులతో కలిసి రాష్ట్రంలో ఏదైనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే సహకారం అందిస్తామని తెలిపారు. మహేంద్రహిల్స్‌ మహాబోధి బుద్ధవిహార్‌కు కావలసిన అభివృద్ధి పనులు, ధ్యానమందిరం నిర్మాణాలకు రూ.కోటి 30 లక్షలు అవుతుందని అంచనాలు వేశారని, ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఆ ప్రతిపాదనను పరిశీలించి ప్రభుత్వం నుంచి మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మహాబోధి బుద్ధవిహార్‌కు రావటం ద్వారా గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బౌద్ధ సాధువులను, భిక్షువులను సీఎం సత్కరించారు. అష్టాంగమార్గం అనే పుస్తకాన్ని విష్కరించారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ ప్రముఖులు ఆంజనేయరెడ్డి, రావుల ఆంజయ్య భిక్ష గురూజీలతోపాటు అడిషనల్‌ డీజీపీ శివధర్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌, శ్రీగణేశ్‌ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2568 బుద్ధ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పర్యాటక శాఖ ఎండీ రమే్‌షనాయుడు మాట్లాడుతూ, గౌతమ బుద్ధుని బోధనలు ప్రపంచానికి ఆదర్శనీయమని కొనియాడారు. డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి రచించిన బుద్ధుని మొదటి ప్రవచనం, బుద్ధుని చివరి రోజులు అనే పుస్తకాలను రమే్‌షనాయుడు ఆవిష్కరించారు.

Updated Date - May 24 , 2024 | 05:18 AM

Advertising
Advertising