CM Revanth Reddy: నేడు బెల్గాంకు సీఎం రేవంత్
ABN, Publish Date - Dec 26 , 2024 | 04:09 AM
ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మాగాంధీ ఎన్నికై వంద సంవత్సరాలు గడిచిన సందర్భంగా కర్నాటకలోని బెల్గాంలో రెండు రోజుల పాటు జరగనున్న సీడబ్ల్యుసీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం వెళ్లనున్నారు.
టీపీసీసీ చీఫ్ మహేశ్, మంత్రులు ఉత్తమ్, దామోదర కూడా
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మాగాంధీ ఎన్నికై వంద సంవత్సరాలు గడిచిన సందర్భంగా కర్నాటకలోని బెల్గాంలో రెండు రోజుల పాటు జరగనున్న సీడబ్ల్యుసీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం వెళ్లనున్నారు. ఆయనతో పాటుగా టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీడబ్ల్యుసీ సభ్యులు దామోదర రాజనర్సింహ, వంశీచంద్‌రెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్ష నేత జీవన్‌రెడ్డి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో బెల్గాంకు వెళ్లనున్న వీరు.. రెండు రోజుల పాటు జరిగే సీడబ్ల్యుసీ, ఏఐసీసీ సమావేశాల్లో పాలు పంచుకుంటారు.
Updated Date - Dec 26 , 2024 | 04:09 AM