ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌..

ABN, Publish Date - Dec 12 , 2024 | 03:18 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఏడాది పాలనలో సాధించిన రాష్ట్ర ప్రగతిపై ఆయన కాంగ్రెస్‌ అధిష్ఠానానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది.

అధిష్ఠానానికి ప్రగతి నివేదిక!

  • మంత్రివర్గ విస్తరణపైనా చర్చించే చాన్స్‌

  • పెండింగ్‌ నిధులపై కేంద్రానికి వినతిపత్రాలు

హైదరాబాద్‌, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఏడాది పాలనలో సాధించిన రాష్ట్ర ప్రగతిపై ఆయన కాంగ్రెస్‌ అధిష్ఠానానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులతో చర్చలు జరిపిన రేవంత్‌.. ఈ మేరకు సమగ్ర నివేదికను రూపొందించినట్లు సమాచారం. బుధవారం బంధువుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎంకు విమానాశ్రయంలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్‌, సీఎల్పీ నేత తికారం జల్లి, ఎమ్మెల్యే అమిత్‌ చరణ్‌లు ఘన స్వాగతం పలికారు. వివాహ వేడుకల అనంతరం అక్కడి నుంచే గురువారం ఢిల్లీ చేరుకోనున్న రేవంత్‌.. ప్రగతి నివేదికలో భాగంగా గ్యారెంటీల అమలుతో పాటు రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్‌ తదితర పథకాల అమలు, కులగణన.. తదితర అంశాలను అధిష్ఠానానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణపైనా అధిష్ఠానం పెద్దలతో చర్చించే అవకాశమున్నట్లు చెబుతున్నారు.


కేంద్ర మంత్రులనూ కలవనున్న సీఎం..

ఢిల్లీ పర్యటనలో పెండింగ్‌ నిధులపై కేంద్ర మంత్రులనూ సీఎం రేవంత్‌ కలవనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టితో పాటుగా ఆయా కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించనున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపైన కేంద్ర పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రాష్ట్రానికి కేటాయించిన కోటా నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు సమాచారం.

Updated Date - Dec 12 , 2024 | 03:18 AM