ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌..

ABN, Publish Date - Nov 25 , 2024 | 02:18 AM

సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టి డిసెంబరు 7 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఏఐసీసీ పెద్దలను ఆయన కలవనున్నారు.

  • ప్రజా విజయోత్సవాలపై అధిష్ఠానంతో చర్చ

  • మంత్రివర్గ విస్తరణపైనా.. తెలంగాణ తల్లి విగ్రహం

  • ఆవిష్కరణకు సోనియా, రాహుల్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టి డిసెంబరు 7 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఏఐసీసీ పెద్దలను ఆయన కలవనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల గురించి తెలపడంతోపాటు ఢిల్లీ పెద్దలను ఈ ఉత్సవాలకు ఆహ్వానించనున్నట్టు తెలిసింది. అలాగే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతోనూ రేవంత్‌ భేటీ కానున్నారు. అఽధికారం చేపట్టి ఏడాది అవుతున్నా.. మంత్రివర్గంలో ఇంకా 6 స్థానాలు ఖాళీగానే ఉన్న నేపథ్యంలో క్యాబినెట్‌ విస్తరణపై రాహుల్‌తో చర్చించనున్నట్టు సమాచారం.


ఇక సచివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహాన్ని.. డిసెంబర్‌ 9న ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి సోనియా, రాహుల్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్టు సమాచారం. ఇటు ఖాళీగా ఉన్న కొన్ని కార్పొరేషన్‌ పదవుల భర్తీతోపాటు ‘కులగణన’ పైనా అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఇదిలాఉండగా.. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా కుటుంబ ఫంక్షన్‌లో సీఎం పాల్గొనున్నట్టు తెలిసింది.

Updated Date - Nov 25 , 2024 | 02:18 AM