ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Recruitment Process: 15 రోజుల్లోగా నియామకాలు!

ABN, Publish Date - Aug 27 , 2024 | 04:32 AM

డీఎస్సీ 2008 బాధితులకు 15 రోజుల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం కార్యాలయ అధికారులు హామీ ఇచ్చినట్టు డీఎస్సీ 2008 సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సభావాట్‌ శ్రీనివాస్‌ నాయక్‌ తెలిపారు.

  • 2008 డీఎస్సీ బాధితులకు సీఎం కార్యాలయ అధికారుల హామీ

  • డీఎస్సీ 2008 సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ నాయక్‌ వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ 2008 బాధితులకు 15 రోజుల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం కార్యాలయ అధికారులు హామీ ఇచ్చినట్టు డీఎస్సీ 2008 సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సభావాట్‌ శ్రీనివాస్‌ నాయక్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత మార్చిలో తీసుకున్న నిర్ణయం మేరకు తమకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని 2008 డీఎస్సీ బాధితులు సోమవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ రెడ్డి నివాసానికి వచ్చారు. డీఎస్సీ 2008 సాధన సమితి నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 200మందికిపైగా అభ్యర్థులు సీఎం ఇంటి వద్దకు చేరుకోగా, వారితో సీఎం వ్యక్తిగత కార్యదర్శి జైపాల్‌ రెడ్డి చర్చలు జరిపారు.


ఈ సందర్భంగా బాధితుల పక్షాన శ్రీనివాస్‌ నాయక్‌ మాట్లాడుతూ.. డీఎస్సీ 2008 బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 8న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అయితే తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని, తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టు ధర్మాసనానికి తెలిపిన గడువు మంగళవారంతో ముగుస్తుందని తెలిపారు. ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల నుంచి వివరాలు సేకరించిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. సంబంధిత ఇతర అధికారులతోనూ చర్చలు జరిపారు. వచ్చే వారం రోజుల్లో క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నుంచి నివేదిక తీసుకొని 15 రోజుల్లో డీఎస్సీ 2008 బాధితులకు నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నట్లు తెలిసింది.

Updated Date - Aug 27 , 2024 | 04:32 AM

Advertising
Advertising
<