ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Collector: పరీక్షలన్నీ చేస్తున్నారా.. మందులు ఇస్తున్నారా..?

ABN, Publish Date - Aug 15 , 2024 | 11:03 AM

వర్షాల నేపథ్యంలో విషజ్వరాలతో ఆస్పత్రుల్లో బాధితులు పెరుగుతున్నారన్న ఫిర్యాదులు వస్తుండడంతో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Collector Anudeep Durishetti) బుధవారం ప్రభుత్వ ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీ చేశారు.

- డెంగీ కిట్‌లు సరిపడా ఉన్నాయా..

- ఫీవర్‌ ఆస్పత్రి, యూపీహెచ్‌సీలలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్‌ సిటీ: వర్షాల నేపథ్యంలో విషజ్వరాలతో ఆస్పత్రుల్లో బాధితులు పెరుగుతున్నారన్న ఫిర్యాదులు వస్తుండడంతో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Collector Anudeep Durishetti) బుధవారం ప్రభుత్వ ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య పరీక్షలు చేస్తున్నారా.. మందులు అన్నీ ఇస్తున్నారా.. అంటూ రోగులను ప్రశ్నించి వివరాలను సేకరించారు. అంతేకాకుండా డెంగీ కిట్‌లు, ఎలిజా, ఆర్‌డీఎస్‌ సరిపడా ఉన్నాయా.. రోజుకు ఎన్ని టెస్ట్‌లు చేస్తున్నారు.. అని ఫార్మసీ(Pharmacy) సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: పన్నెండేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..


నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిని, బండ్లగూడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాగా, ఫీవర్‌ ఆస్పత్రిలో ఐసీయూ వార్డు, ఫార్మసీ, హాజరు రిజిస్టర్‌, మందుల నిల్వలను పరిశీలించారు. అలాగే వార్డులను సందర్శించి రోగులను పరామర్శించారు. బండ్లగూడ గౌస్‌ నగర్‌(Bandlaguda Gaus Nagar)లోని ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బండ్లగూడలో విష జ్వరాలు ఉన్నాయన్న ఫిర్యాదులు రావడంతో ఆస్పత్రిని తనిఖీ చేసినట్లు తెలిపారు.


ఆస్పత్రిలో రెండురకాల మందుల కొరత ఉందని తమ దృష్టికి వచ్చిందని, సెంట్రల్‌ డ్రగ్స్‌ బోర్డు ద్వారా అన్ని రకాల మందులు సరఫరా చేయిస్తామన్నారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉందని, భవన నిర్మాణ పనులు పెండింగ్‌ ఉన్నాయని, హైస్కూల్‌లో టీచర్‌ల కొరత ఉందని స్థానిక కార్పొరేటర్‌ తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. పాఠశాల పెండింగ్‌ పనులను త్వరలో పూర్తి చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా ఆస్పత్రుల్లో కలెక్టర్‌ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకట్‌, ఫీవర్‌ ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్‌ జయశ్యామ్‌, బండ్లగూడ రెవెన్యూ అధికారి జయమ్మ, డాక్టర్‌ వై.రమేష్‌, స్థానిక కార్పొరేటర్‌, హాఫీజ్‌ పటేల్‌, తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 15 , 2024 | 11:03 AM

Advertising
Advertising
<