ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MLC Kavitha: పార్లమెంట్‌లో తెలంగాణపై మాట్లాడని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు

ABN, Publish Date - Mar 07 , 2024 | 07:01 PM

తెలంగాణలో కృత్రిమమైన కరువు ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఈ కరువు వచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు. గురువారం నాడు తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.... మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) బద్నాం చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

MLC Kavitha

హైదరాబాద్: తెలంగాణలో కృత్రిమమైన కరువు ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఈ కరువు వచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు. గురువారం నాడు తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.... మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) బద్నాం చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సాగు, తాగునీరు ఇవ్వలేమని ముఖ్యమంత్రి రేవంత్ అంటున్నారన్నారు. నెత్తిమీద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్న దాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోవట్లేదని ప్రశ్నించారు. ప్రజాపాలనలో బీసీ, మేజర్ కులాల ప్రాధాన్యత లేదన్నారు. మున్నూరు కాపు, ముదిరాజ్, యాదవ సామాజిక వర్గాల నుంచి క్యాబినెట్‌లో మంత్రి లేరని అన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీతో కలుస్తారని అన్నారు. బీజేపీ సపోర్ట్‌తో 10 ఏళ్లు అధికారంలో ఉంటానని రేవంత్ అంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతల అంతుచూస్తా, మానవ బాంబులు అవుతానని సీఎం రేవంత్ మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. కేసీఆర్‌ని నియంత అని మేధావులు మాట్లాడారని... ఈ ప్రభుత్వ నిర్బందాలపై వారు ఎందుకు ఇప్పుడు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. మహిళలకు వ్యతిరేకంగా రేవంత్ సర్కార్ నిలవబోతుందన్నారు. బీసీ కులగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసిందని.. దానికి చట్టబద్దతను ఎందుకు కల్పించలేదని నిలదీశారు. రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కవిత ధ్వజమెత్తారు.

అరవింద్‌ని ఎంపీ ఎన్నికల్లో ఓడిస్తా

ధర్నాచౌక్‌లో ధర్నాలు చేసేందుకు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదని ప్రశ్నించారు. కచ్చితంగా రేపు జాగృతి ఆధ్వర్యంలో దీక్ష చేసి తీరుతామని హెచ్చరించారు. ఎంపీగా పోటీ చేయాలని పార్టీ నిర్ణయంపై కట్టుబడి ఉంటానని తెలిపారు. బీజేపీ ఎంపీ అరవింద్ (MP Arvind) ఎక్కడ నిలబడ్డా ఒడిస్తానని సవాల్ విసిరారు. మొన్న కోరుట్లలో ఓడించానని రాబోయే ఎంపీ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతుందని హెచ్చరించారు. మహిళకు తీవ్ర అన్యాయం చేస్తూ జీఓ3 ఇచ్చారని మండిపడ్డారు. ఫిబ్రవరి 6వ తేదీన కోర్టు ఉత్తర్వులను ఎందుకు అప్పీల్ చేయలేదన్నారు. మహిళలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని.. ప్రజా వ్యతిరేక పాలన అని చెప్పారు. యూట్యూబ్ ఛానెల్ మీద తీవ్ర కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ పోకడులను చూస్తుంటే తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను బొంద పెట్టాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎన్నడూ తెలంగాణ సమస్యల మీద పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. పార్లమెంట్‌లో తెలంగాణ కోసం తామే కేంద్రాన్ని ప్రశ్నించామని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి లేఖ రాశామని ఈ లేఖపై ఆమె స్పందిస్తే బాగుంటుందని కవిత పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

KTR: రేవంత్ ప్రభుత్వాన్ని మేము కూల్చం.. కేటీఆర్ హాట్ కామెంట్స్

Minister Prabhakar: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే ఎలివేటర్ కారిడార్‌కి మోక్షం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 07:02 PM

Advertising
Advertising