ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: నేటి నుంచి ప్రజా పాలన సంబురాలు

ABN, Publish Date - Dec 07 , 2024 | 03:05 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి జరుగుతున్న ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు సంబురాలు జరగనున్నాయి.

  • ట్యాంక్‌బండ్‌ వద్ద సంగీత కళాకారులతో కార్యక్రమాలు

  • తమన్‌, వందేమాతరం శ్రీనివాస్‌, రాహుల్‌ సిప్లీగంజ్‌ రాక!

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి జరుగుతున్న ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు సంబురాలు జరగనున్నాయి. శని, ఆది, సోమవారాల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డు, ట్యాంక్‌ బండ్‌, హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ వేదికగా పలు సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్ర మాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల్లో వందేమాతరం శ్రీనివాస్‌, రాహుల్‌ సిప్లీగంజ్‌, తమన్‌వంటి సంగీత కళాకారులు పాల్గొననున్నారు. నెక్లెస్‌ రోడ్డు, ట్యాంక్‌ బండ్‌, హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ దగ్గర ఫుడ్‌, హస్తకళల స్టాళ్లు, ఎన్టీఆర్‌ మార్గ్‌లో బాణాసంచా ప్రదర్శన, ట్యాంక్‌బండ్‌ దగ్గర డ్రోన్‌ షో, భారత వాయుసేన నేతృత్వంలో ఎయిర్‌ షోలను నిర్వహించనున్నారు.


కార్యక్రమాల వివరాలు..

  • 7వ తేదీ సాయంత్రం 5నుంచి 9 గంటల వరకు.. నెక్లెస్‌ రోడ్‌ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో (ఐమాక్స్‌ దగ్గర) వందేమాతరం శ్రీనివాస్‌ ఆధ్వరంలో సంగీత కార్యక్రమం ఉంటుంది. ఫుడ్‌, హ్యాండీ క్రాఫ్ట్స్‌, కల్చరల్‌ స్టాల్స్‌ ఏర్పాటవుతాయి.

  • 8న ట్యాంక్‌ బండ్‌ దగ్గర భారత వాయుసేన ఆధ్వర్యంలో ఎయిర్‌ షో, ఐమాక్స్‌ దగ్గర సాయంత్రం 7గంటల నుంచి 8.30వరకు రాహుల్‌ సిప్లీగంజ్‌తో సంగీత కచేరి, నెక్లెస్‌ రోడ్‌ దగ్గర సాయంత్రం 5 నుంచి రాత్రి 9వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుడ్‌, హ్యాండీ క్రాఫ్ట్‌ స్టాళ్లు, కల్చరల్‌ స్టాళ్లు ఉంటాయి. నగరంలో వీధి దీపాల అలంకరణ ఉంటుంది.

  • 9న సాయంత్రం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. సాయంత్రం 5 నుంచి 5.45 గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభ. 5.45 నుంచి 6గంటల వరకు డ్రోన్‌ షో, 6.05 గంటల నుంచి 6.20 వరకు బాణసంచా ఉంటుంది. 6.10 గంటలకు సీఎం రేవంత్‌ సాంస్కృతిక కార్యక్రమాల వేదిక వద్ద చేరుకుంటారు. ఐమాక్స్‌ దగ్గర హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో 7గంటల నుంచి 8.30వరకు తమన్‌ ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఫుడ్‌, హ్యాండీ క్రాఫ్ట్‌ స్టాళ్లు, కల్చరల్‌ స్టాళ్లు ఉంటాయి.

Updated Date - Dec 07 , 2024 | 03:05 AM