Chakradhar Goud: హరీశ్ నా ఫోన్ ట్యాప్ చేయించాడు
ABN, Publish Date - Nov 19 , 2024 | 02:31 AM
మాజీ మంత్రి హరీష్‌రావు తన ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్‌లను ట్యాప్ చేయించాడని సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్‌గౌడ్ ఆరోపించారు.
వ్యతిరేకంగా పనిచేస్తున్నాననే కక్షతో జైలుకు పంపారు
పోలీసులకు ఆధారాలు సమర్పించిన కాంగ్రెస్ నేత చక్రధర్‌గౌడ్
బంజారాహిల్స్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి హరీష్‌రావు తన ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్‌లను ట్యాప్ చేయించాడని సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్‌గౌడ్ ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ అయిందంటూ జూన్ 19న చక్రధర్‌గౌడ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు చక్రధర్‌గౌడ్‌ను గతంలో విచారించిన పోలీసులు సరైన ఆధారాలు తీసుకు రావాలని సూచించారు.
ఈ మేరకు చక్రధర్‌గౌడ్ సోమవారం జూబ్లీహిల్స్ ఏసీపీని కలిసి ట్యాప్ అయినట్టు అనుమానిస్తున్న సెల్‌ఫోన్‌తో పాటు యాపిల్ కంపెనీ నుంచి ఫోన్ ట్యాప్ అయిందని వచ్చిన మెయిల్ కాగితాలు, ఇతర వివరాలను విచారణ అధికారులకు అందచేశారు. హరీశ్‌రావుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాననే కక్షతో తనపై అనేక కేసులు పెట్టి జైలుకు పంపించారని చక్రధర్‌గౌడ్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రంగనాయకసాగర్ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది తానేనని ఆయన వెల్లడించారు.
Updated Date - Nov 19 , 2024 | 02:31 AM