Warangal: మా పనిలో మంత్రి జోక్యమేల?
ABN, Publish Date - Oct 17 , 2024 | 03:58 AM
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో తాము నిర్వహించాల్సిన పనుల్లోనూ మంత్రి కొండా సురేఖ జోక్యం పెరిగిపోయిందంటూ టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్ గౌడ్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఫిర్యాదు చేశారు.
స్థానిక ఎన్నికల్లో ఇబ్బంది కలగదా?
పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఓపిక పడ్తున్నం
మంత్రి కొండా సురేఖపై టీపీసీసీ చీఫ్‌కు
వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో తాము నిర్వహించాల్సిన పనుల్లోనూ మంత్రి కొండా సురేఖ జోక్యం పెరిగిపోయిందంటూ టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్ గౌడ్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆమెను నియంత్రించాలని కోరారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు డీసీసీ అధ్యక్షులు, ఒక ఎమ్మెల్సీ బుధవారం మహే్‌షకుమార్‌గౌడ్‌ను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భగా తమ తమ నియోజకవర్గాల్లో మంత్రి కొండా సురేఖ జోక్యం ఎక్కువైందని ఆయన దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ సైతం సరిగా పాటించట్లేదంటూ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
అన్ని విషయాల్లోనూ మంత్రి జోక్యం చేసుకుంటూ ఇబ్బందికరమైన వాతావరణాన్ని కలిగిస్తున్నారన్నారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాము ఓపిక పడుతున్నామని, ఇదే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఇబ్బంది కలగదా అని ప్రశ్నించారు. ఈ పరిస్థితులను నియంత్రించాలని టీపీసీసీ చీఫ్‌ను వారు కోరారు. కాగా.. ఇదే అంశంపైన వారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీనీ కలిసి ఫిర్యాదు చేశారు. అధిష్ఠానానికీ లేఖ రాశారు. కార్యకర్తల అత్యుత్సాహంతో తలెత్తిన ఈ సమస్యలను.. మాట్లాడి పరిష్కరిస్తామంటూ మహే్‌షకుమార్‌గౌడ్, దీపామున్షీదా్‌సలు ఎమ్మెల్యేలు, నేతలకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. సురేఖపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, యశస్వినీరెడ్డి తదితరులు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Updated Date - Oct 17 , 2024 | 03:58 AM