ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేసీఆర్‌ ఎవరికీ కండువా కప్పలేదు

ABN, Publish Date - Sep 14 , 2024 | 04:07 AM

‘‘గత పదేళ్లలో ఒక్క ఎమ్మెల్యేకూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యక్తిగతంగా పార్టీ కండువా కప్పలేదు.

  • కప్పినట్టు చూపితే రాజీనామా చేస్తా: కౌశిక్‌ రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘‘గత పదేళ్లలో ఒక్క ఎమ్మెల్యేకూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యక్తిగతంగా పార్టీ కండువా కప్పలేదు. అలా కప్పినట్లుగా చూపితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’’ ..బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇటీవల మీడియాతో అన్న మాటలివి. కానీ, 2014 నవంబరు 16న.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కాలె యాదయ్యను నాటి సీఎం కేసీఆర్‌ స్వయంగా కండువా కప్పి బీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నారు.


అన్ని పార్టీలవారూ బంగారు తెలంగాణ కోసం తమతో చేతులు కలపాలని కేసీఆర్‌ మీడియా ముందు అన్నారు! ‘‘మరి.. ఇది పార్టీలో చేర్చుకోవడం కాదా? కేసీఆర్‌ ఎవరికీ కండువా కప్పలేదని ఎలా అంటారు?’’ అని సోషల్‌మీడియాలో విమర్శిస్తున్నారు.

Updated Date - Sep 14 , 2024 | 04:07 AM

Advertising
Advertising