ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kiran Kumar Reddy: భావితరాల భవిష్యత్తు కోసమే హైడ్రా..

ABN, Publish Date - Sep 29 , 2024 | 04:05 AM

భావితరాల భవిష్యత్తు కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

  • రేవంత్‌కు పేరొస్తుందన్న భయంతోనే ప్రతిపక్షాల రాద్ధాంతం: ఎంపీ చామల

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): భావితరాల భవిష్యత్తు కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైడ్రా వల్ల రేవంత్‌కు మంచి పేరు వస్తుందన్న భయంతోనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబా ద్‌ భవిష్యత్తు గురించి ఆ పార్టీలు ఆలోచన చేయడం లేదన్నారు. గత పదేళ్లలో రాజకీయ అండదండలతో కబ్జాలు చేసిన నాయకులే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.


శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటా వరదలతో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్‌ ప్రజలకు పరిష్కారం చూపాలన్నదే సీఎం రేవంత్‌ ఆలోచన అని తెలిపారు. హైదరాబాద్‌లో నాలాల మీద, చెరువుల స్థలాల్లో 28 వేల అక్ర మ కట్టడాలు ఉన్నాయని, వాటిని కూల్చేస్తే తప్ప హైదరాబాద్‌ మనుగడ సాగించలేదని, మీడియాతో పాటు ప్రజలు కూల్చివేతలకు సహకరించాలని.. నాడు సీఎం హోదాలో కేసీఆర్‌ మాట్లాడారని గుర్తు చేశారు. ఆ రోజు కేసీఆర్‌ చేయలేని పని నేడు సీఎం రేవంత్‌ చేస్తున్నారని తెలిపారు.

Updated Date - Sep 29 , 2024 | 04:05 AM