ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ram Mohan Reddy: లగచర్ల దాడి వెనక బీఆర్‌ఎస్‌ హస్తం

ABN, Publish Date - Nov 23 , 2024 | 03:42 AM

లగచర్లలో కలెక్టర్‌, అధికారులపై దాడి వెనక బీఆర్‌ఎస్‌ హస్తం ఉందని కాంగ్రెస్‌ నిజనిర్ధారణ కమిటీ తెలిపింది. శుక్రవారం మీడియా సమావేశంలో కమిటీ ప్రతినిధులు ఎంపీ మల్లు రవి, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి మాట్లాడారు.

  • భూమి లేని 17 మంది దాడి చేసేందుకు వచ్చారు

  • మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ నిజనిర్ధారణ కమిటీ

  • సీఎం రేవంత్‌కు నివేదిక అందజేత

హైదరాబాద్‌/పరిగి/కొడంగల్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): లగచర్లలో కలెక్టర్‌, అధికారులపై దాడి వెనక బీఆర్‌ఎస్‌ హస్తం ఉందని కాంగ్రెస్‌ నిజనిర్ధారణ కమిటీ తెలిపింది. శుక్రవారం మీడియా సమావేశంలో కమిటీ ప్రతినిధులు ఎంపీ మల్లు రవి, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి మాట్లాడారు. తమ బృందం లగచర్ల గ్రామానికి వెళ్లిందని, అక్కడ రైతులతోపాటు జిల్లా కలెక్టర్‌తోనూ మాట్లాడిందని మల్లు రవి తెలిపారు. కలెక్టర్‌, అధికారులు రాగానే.. కొందరు తాగి వచ్చి, కర్రలతో, రాళ్లతో దాడులు చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డి, సురేశ్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ప్రణాళికా ప్రకారం దాడి చేయించారని, 17 మంది భూమి లేని వారు దాడి చేయడానికి అక్కడికి వచ్చారని చెప్పారు.


రేవంత్‌ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకం కాదని, బలవంతంగా రైతుల భూములు తీసుకునే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారన్నారు. రామ్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో ఉండి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారు. కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ని చంపించే ప్రయత్నం చేశారు. ప్రజా ప్రభుత్వంపై మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ దురాగతాలకు పాల్పడుతున్నారు’ అని మండిపడ్డారు. అనంతరం లగచర్ల ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డికి వారు నివేదికను సమర్పించారు. ఇటు ఈ దాడి కేసులో మరో నిందితుడు మంగ్యానాయక్‌ని రిమాండ్‌కు తరలించినట్లు కొడంగల్‌ సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మొత్తం 71 మందిపై కేసులు నమోదవగా, ఇప్పటివరకు 29 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Nov 23 , 2024 | 03:42 AM