ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Counseling : 19 నుంచి బీఫార్మసీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌

ABN, Publish Date - Oct 08 , 2024 | 03:26 AM

రాష్ట్రంలో బీఫార్మసీ, ఫార్మా-డి, బయో-టెక్నాలజీ వంటి కోర్సుల భర్తీ కోసం ఈ నెల 19వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీఫార్మసీ, ఫార్మా-డి, బయో-టెక్నాలజీ వంటి కోర్సుల భర్తీ కోసం ఈ నెల 19వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎప్‌సెట్‌ ప్రవేశ పరీక్ష రాసిన బైపీసీ అభ్యర్థుల కోసం ఈ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి 22వరకు అభ్యర్థులు స్లాట్‌ను నమోదు చేసుకుని కౌన్సెలింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


23వ తేదీలోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియను చేపడతారు. 21 నుంచి 25వ తేదీ వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 28న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 30వ తేదీలోపు ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి తుది దశ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు.

Updated Date - Oct 08 , 2024 | 03:26 AM