లగచర్ల రైతుల బెయిల్ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా
ABN, Publish Date - Nov 29 , 2024 | 05:03 AM
లగచర్లలో అధికారులపై దాడి జరిగిన కేసులో రైతులు, ఇతర నిందితుల పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.
వికారాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): లగచర్లలో అధికారులపై దాడి జరిగిన కేసులో రైతులు, ఇతర నిందితుల పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ ఘటనలో అరెస్టయి సంగారెడ్డి జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితులకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ గురువారం వికారాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. నిందితుల తరఫున బీఆర్‌ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. గడువు కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ఇదే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది.
Updated Date - Nov 29 , 2024 | 05:03 AM